Punjab | పంజాబ్ ముఖ్యమంత్రి ఓ యువకుడికి సహాయం చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చండీగఢ్‌లోని ఓ ప్రాంతంలో ఓ యువకుడు బైక్ పై వెళ్తుండగా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. సరిగ్గా ఇదే సమయంలో పంజాబ్ సీఎం చెన్నీ కాన్వాయ్ రయ్ మంటూ ఒక్క సారిగా అక్కడి నుంచి దూసుకెళ్లింది. అయినా… ఈ సంఘటన సీఎం చెన్నీ కంట్లో పడింది. దీంతో ఒక్కసారిగా తన కాన్వాయ్‌ను ఆపేశారు. నడుచుకుంటూ… ఆ యువకుడి వద్దకు వెళ్లి, ఆ యువకుడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్ వచ్చేంత వరకూ అక్కడే వుండి, అవసరమైన సహాయం చేశారు. ఆ తర్వాత ఆ యువకుడికి షేక్‌హ్యాండ్ ఇచ్చి సీఎం చెన్నీ వెళ్లిపోయారు.