రాంచీ: అతడు ఓ స్కూల్‌కు ప్రధానోపాధ్యాయుడు (Principal). తన పాఠశాలలో చదువుతున్న పిల్లలను కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన అతడు కీచకుడిగా మారాడు. స్కూల్ హాస్టళ్లో ఉంటున్న మైనర్ బాలికలను వేధిస్తున్నాడు. దీంతో ఆ చిన్నారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రిన్సిపల్‌ను అరెస్టుచేసిన ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.
జార్ఖండ్‌లోని ఛాయ్‌బాసా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నాడని ఏడుగురు మైనర్ విద్యార్థినులు ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. వారంతా స్కూల్ హాస్టల్లో ఉంటున్నారని చెప్పారు. నిందితున్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.