గుడిలో పూజారిని కొట్టిన మహిళ..
పూజారి| ఓ మహిళ పూజారిని గుడిలో అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మనస్థాపానికిగురైన ఆ పూజారి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లాలో జరిగింది.

జైపూర్: ఓ మహిళ పూజారిని గుడిలో అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మనస్థాపానికిగురైన ఆ పూజారి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లాలో జరిగింది.
ఆల్వార్ జిల్లాలోని ఓ గుడిలో జగదీశ్ అనే పూజారి పనిచేస్తున్నాడు. గత బుధవారం అతడిని ఓ మహిళ అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టింది. ఆమెతోవచ్చినవారు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది గురువారం బాగా వైరల్ అయ్యింది. దీంతో మనస్థాపం చెందిన ఆ జగదీశ్ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే అతడిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని వైదులు చెప్పారు. కాగా, పూజారి కుమారుడు ఆ మహిళపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే అప్పటికే ఆమె పూజారి గుడిలో తనను వేధించడాని కేసు పెట్టింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

