Power Consumption | భారత్‌లో కరెంటును తెగ వాడేస్తున్నారు..! డిమాండ్ ఎంత పెరిగిందంటే..!
Power Consumption | భారత్‌లో విద్యుత్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొమ్మిది శాతం పెరుగుదల నమోదైంది. ఏప్రిల్-నవంబర్ మధ్య దేశంలో మొత్త విద్యుత్ వినియోగం 1099.90 బిలియన్ యూనిట్లుగా రికార్డయ్యింది.
Power Consumption | భారత్‌లో విద్యుత్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొమ్మిది శాతం పెరుగుదల నమోదైంది. ఏప్రిల్-నవంబర్ మధ్య దేశంలో మొత్త విద్యుత్ వినియోగం 1099.90 బిలియన్ యూనిట్లుగా రికార్డయ్యింది. గతేడాది ఇదే సమయంలో విద్యుత్ వినియోగం 1010.20 బిలియన్ యూనిట్లుగా ఉన్నది. 2021-22 సంవత్సరంలో ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో మొత్తం వినియోగం 916 బిలియన్ యూనిట్లుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వినియోగం 1504.26 బిలియన్ యూనిట్లు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1374 బిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ.
కారణమేంటంటే..?
ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో విద్యుత్ వినియోగం 9శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థలో భూమ్ కారణమని ఇంధనరంగ నిపుణులు పేర్కొటున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23లో దేశంలో విద్యుత్ వినియోగం 50.8 శాతం పెరిగిందని కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్కే సింగ్ ఇటీవల లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. 2013-14లో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 136 గిగావాట్లు కాగా.. 2023లో ఈ డిమాండ్ 243 గిగావాట్లకు పెరిగింది. మంత్రి మాట్లాడుతూ.. సామర్థ్యాన్ని 194 గిగావాట్లకు పెంచాం.. దీంతో పెరుఉతున్న విద్యుత్ డిమాండ్‌తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుకుంటుందని ఇంధన మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, ఏప్రిల్-జూలైలో కురిసిన అకాల వర్షాల కారణంగా విద్యుత్ డిమాండ్ కాస్త తక్కువగా ఉండడంతో ఇప్పటికీ ఆశించిన స్థాయి కంటే తక్కువగానే ఉన్నది.
నవంబర్‌లో డిమాండ్ ఎంతంటే..?
గత జూన్‌లో దేశంలో విద్యుత్ డిమాండ్ 224 గిగావాట్లకు చేరినప్పటికీ, జులైలో అది క్షీణించి 209 గిగావాట్లకు చేరుకుంది. ఆ తర్వాత ఆగస్టులో 238.82 గిగావాట్లు, సెప్టెంబర్‌లో 243.27 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నది. అక్టోబర్‌లో దేశంలో విద్యుత్ డిమాండ్ 222.16 గిగావాట్లు కాగా, నవంబర్‌లో 204.86 గిగావాట్లు రికార్డయ్యింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే, జున్ నెలల్లో కురిసిన వర్షాల కారణంగా విద్యుత్ డిమాండ్ తగ్గినా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో పాటు పండుగల సీజన్‌కావడంతో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడంతో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | చెన్నైకి 590 కిలోమీటర్ల దూరంలో అక్వాన్.. శుక్రవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటే ఛాన్స్
రాజాపేటలో గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
I hate Marriage Trailer | యూత్‌కు కనెక్ట్ అయ్యేలా.. ‘ఐ హేట్ మ్యారేజ్’ ట్రైలర్ విడుదల!
ఎంజీయూలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన
AP News | పులివెందులలో ఉద్రిక్తత.. టీడీపీ నేత కారుకు నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

