న్యూఢిల్లీ, జూలై 31: ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఫ్రాంజైజీ సబ్వే తన ఆహారోత్పత్తుల ప్రచారం కోసం వినూత్న పంథా ఎంచుకొంది. తమ పేర్లను చట్టబద్ధంగా ‘సబ్వే’ అని మార్చుకున్న వారికి జీవితాంతం శాండ్విచ్లు ఉచితంగా అందిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఈ ఆఫర్ పోటీలో పాల్గొనాలనుకొనేవారు subwaynamechange.com వెబ్సైట్లో ఆగస్టు 4 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. పేర్లు నమోదు చేసుకొన్నవారిలో ఒక అదృష్టవంతుడిని ఎంపిక చేసి అతడికి జీవితాంతం శాండ్విచ్లు అందించడంతో పాటు.. చట్టపరంగా పేరు మార్పు కోసం ఖర్చయిన మొత్తాన్ని కూడా చెల్లిస్తామని ప్రకటించింది.