సీతామర్హి: బీహార్‌లో ఓ పోలీసు ఆఫీసర్‌పై .. పెట్రోల్ పంపు(Petrol Pump) సిబ్బంది చేయిచేసుకున్నది. ఓ వర్కర్‌ను పోలీసు చెంపదెబ్బ కొట్టడంతో గొడవ పెద్దగా మారింది. తన వాహనంలో రూ. 120 పెట్రోల్ పోయాలని పోలీసు అడగ్గా, ఆ వర్కర్ రూ.720 పెట్రోల్ పోశాడు. దీంతో వాగ్వాదం జరిగింది. బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది. 120 పెట్రోల్ పోయమంటే, వర్కర్ పొరపాటును 720 పెట్రోల్ పోశాడు. ఆ నేపథ్యంలో కోపంతో వర్కర్‌పై పోలీసు చేయి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత జరిగిన ఘటన అతన్ని షాక్‌లోకి నెట్టేసింది. పెట్రోల్ పంపులోని స్టాఫ్ సభ్యులు, మేనేజర్ కలిసి ఆ పోలీసును చితకబాదారు. ఈ ఘటనకు చెందిన దృశ్యాలు సీసీకెమెరాకు చిక్కాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
20 का मांगा पेट्रोल, 720 का भर दिया; विरोध करने पर चौकीदार ने मारा थप्पड़, जवाब में उसे 30 सेकंड में 10 थप्पड़ जड़े, पिटाई का वीडियो वायरल।#PetrolScam #ViralVideo #BiharNews #चौकीदार_की_पिटाई #पेट्रोल_धोखाधड़ी #CustomerRights #ViralFootage pic.twitter.com/vQvjV5yU1p
— FirstBiharJharkhand (@firstbiharnews) July 4, 2025