PM Modi | ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే వికసిత్ భారత్ : ప్రధాని మోదీ
PM Modi : లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా వారికి పరాజయం తప్పలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ మంగళవారం సాయంత్రం లోక్‌సభలో బదులిస్తూ పలు అంశాలపై ప్రసంగించారు.
PM Modi : లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా వారికి పరాజయం తప్పలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ మంగళవారం సాయంత్రం లోక్‌సభలో బదులిస్తూ పలు అంశాలపై ప్రసంగించారు. ప్రజలు తమ పాలన, ట్రాక్ రికార్డు చూశారని చెప్పారు. తమ పదేండ్ల హయాంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. అవినీతిని ఏమాత్రం సహించకుండా పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ దశాబ్ధంలో భారత్ ఖ్యాతి పెరిగిందని వివరించారు. రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్ భారత్ లక్ష్యాలను వివరించారని, ఈ దిశగా తమ ప్రస్ధానం సాగుతుందని స్పష్టం చేశారు. నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. సభలో నిన్న, ఇవాళ రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు ఎంపీలు తమ అభిప్రాయాలను వెల్లడించారని, వీరిలో కొందరు తొలిసారి ఎంపీలు అయినవారు కూడా ఉన్నారని తెలిపారు.
వీరు పార్లమెంట్ నిబంధనలను అనుసరిస్తూ అనుభవం కలిగిన పార్లమెంటేరియన్లలా వ్యవహరించడం సంతోషకరమని చెప్పారు. వీరు తొలిసారి చట్టసభలకు ఎన్నికైన సభ హుందాతనాన్ని పెంచేలా ప్రవర్తించారని ప్రశంసించారు. వారి అభిప్రాయాలతో చర్చను మరింత ఫలప్రదం చేశారని పేర్కొన్నారు. లౌకిక వాదం అంటే సామాజిక న్యాయం పాటించడమని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. దేశ ప్రజలు తమపై భరోసా ఉంచారని అన్నారు. వికసిత్ భారత్‌తో ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని అన్నారు. తమ ప్రభుత్వ పధకాలు సామాన్యులకు చేరుతున్నాయని చెప్పారు.
ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు
ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాల నిరసనల మధ్యే తన ప్రసంగాన్ని కొనసాగించారు. మణిపూర్, నీట్ అంశాలపై మాట్లాడాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మోదీ ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు పదేపదే అడ్డుతగిలారు. విపక్ష సభ్యుల తీరుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులను వెల్‌లోకి పంపేలా విపక్ష నేతలు వ్యవహరించడం సరైంది కాదని హితవు పలికారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

