పోలీస్ స్టేషన్లో తుపాకీ, యూనీఫాం ఎత్తుకెళ్లిన దొంగ..
Uttar Pradesh | దొంగతనాలకు పాల్పడేవారిని హడలెత్తించే పోలీసుల తుపాకీనే ఎత్తుకెళ్లాడో ఘనుడు. తుపాకీనే కాదు పోలీస్ యూనీఫాం, పది కాట్రిజ్‌లును కూడా దొంగిలించాడు. అదీ పోలీస్ స్టేషన్ నుంచే.
లక్నో: దొంగతనాలకు పాల్పడేవారిని హడలెత్తించే పోలీసుల తుపాకీనే ఎత్తుకెళ్లాడో ఘనుడు. తుపాకీనే కాదు పోలీస్ యూనీఫాం, పది కాట్రిజ్‌లును కూడా దొంగిలించాడు. అదీ పోలీస్ స్టేషన్ నుంచే. వినడానికి కొంత వింతగా ఉన్నా.. ఇది నిజమే. పోలీసులకే సవాల్‌గా నిలిచిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో జరిగింది.

కాన్పూర్‌లోని న్యూ ఆజాద్ నగర్ పరిధిలోని బిద్నూ ఔట్‌పోస్టులో గత రాత్రి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసు పిస్తోల్‌తోపాటు యూనిఫాంను ఎత్తుకెళ్లారు. తుపాకీ కనింపించకపోవడంతో.. ఔట్‌పోస్ట్ ఇన్చార్జీ సుధాకర్ పాండే కేసు నమోదుచేశారు. అయితే విషయం కాస్తా పై అధికారుల దృష్టికి వెళ్లడంతో జిల్లా ఎస్పీ.. సుధారక్ పాండేపై వేటువేశారు. పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ తుపాకీతోపాటు యూనీఫాం, పది కాట్రిజ్‌లు కనిపించకుండా పోయాయని గుర్తించారు. ఈ వ్యవహారంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Kanpur
- pistol
- Police station
- Stolen
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | పెన్షన్లు ముఖ్యమంత్రి చూస్తడు.. దివ్యాంగుడితో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Rahul gandhi | టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై రాహుల్‌గాంధీ ఫైర్..!
Kriti Sanon | ఏఐ నన్ను భయపెడుతోంది.. సోషల్ మీడియాపై కృతి సనన్ ఆందోళన!
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

