జ్ఞానేశ్ కుమార్‌ను గద్దె దించేందుకు.. జోక్యం చేసుకోండి
గత రెండేండ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయండి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇండియా కూటమి నేతల వినతి
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: విపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్ద ‘ఓట్ల చోరీ’ అంశాన్ని లేవనెత్తాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను కోరడం, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)ను నిలిపివేయడం, గత రెండేండ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయడం వంటి చర్యల కోసం తన అధికారాలను వినియోగించాలని వారు ఆమెను కోరారు. రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్లకు(ఈసీలు) జీవితకాల రక్షణ కల్పించే 2023 నాటి చట్టాన్ని రద్దు చేయాలని, అలాగే అన్ని ఎన్నికల్లోనూ తిరిగి పేపర్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది.
ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించిన 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని, అలాగే ఓట్ల చోరీకి సంబంధించి కచ్చితమైన ఆధారాలు లభించిన గత రెండేండ్ల నాటి అసెంబ్లీ ఎన్నికలన్నింటినీ రద్దు చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. కోట్లాదిమంది భారతీయుల రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును హరించడానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా భారతదేశ ఎన్నికల వ్యవస్థను, ప్రజాస్వామ్య చట్రాన్ని నీరుగార్చారని ఆందోళన చెందుతూ దేశ జనాభాలో 60 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియా కూటమి ఎంపీలు రాష్ట్రపతి జోక్యాన్ని కోరుతూ ఆమెను సంప్రదించినట్టు వారు చెప్పారు.
వరుసగా జరిగిన ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందనడానికి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నట్లు వారు రాష్ట్రపతికి తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగింది. మరికొన్ని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈవీఎంలు, ఓటర్ల జాబితాలను బీజేపీ పూర్తిగా తారుమారు చేసిందిఅని వినతిపత్రంలో ఇండియా కూటమి ఆరోపించింది.
రాష్ట్రపతి ఆధారాలు అడిగారు: రాహుల్
సమావేశం అనంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఎన్నికల మోసంపై విపక్షాలు చేసిన ఆరోపణలను రాష్ట్రపతి ఖండించకపోవడం లేదా ప్రశ్నించకపోవడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. సాక్ష్యాధారాలు సమర్పించాలని ప్రతినిధి బృందాన్ని రాష్ట్రపతి కోరారని, ఈ విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. ఓట్ల చోరీకి సంబంధించిన ఆధారాల గురించి దేశమంతటికీ తెలుసునని నేను ఆమెతో చెప్పాను. వరుసగా అనేక రాష్ర్టాల్లో ఓట్ల చోరీ జరిగింది. అయినప్పటికీ ఆధారాలు సమర్పించాలని రాష్ట్రపతి మమ్మల్ని కోరుతున్నారు. వాటిని ఆమెకు అందించడానికి మేము సిద్ధం అని రాహుల్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

