లక్నో: విద్యార్థిని శిక్షించిన ఒక టీచర్‌పై పేరెంట్ దాడి చేశాడు. (Parent Assaults Teacher) ఉపాధ్యాయుడిపై పంచ్‌లు ఇచ్చాడు. స్కూల్ సిబ్బంది జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని నిలువరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఒక ఉపాధ్యాయుడు దండించాడు. బాలుడితో 50కుపైగా గుంజీలు తీయించాడు. దీంతో ఆ విద్యార్థి కాలు వాచిపోయింది. ఆ బాలుడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ నేపథ్యంలో విద్యార్థి తండ్రి కొందరు వ్యక్తులతో కలిసి ఆ స్కూల్‌కు వెళ్లాడు. ప్రిన్సిపాల్ ఆఫీస్‌లో ఉన్న టీచర్‌పై దాడి చేశాడు. అతడిపై పిడిగుద్దులు కురిపించాడు.
కాగా, ఆ స్కూల్ సిబ్బంది వెంటనే జోక్యం చేసుకున్నారు. టీచర్‌పై దాడి చేసిన విద్యార్థి తండ్రిని సముదాయించారు. అతడ్ని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆ గదిలో ఉన్న విద్యార్థి కూడా తండ్రి తీరు చూసి షాక్ అయ్యాడు.
మరోవైపు ఈ సంఘటనపై ఆ స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రిన్సిపాల్ ఆఫీస్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
कानपुर: बसंत विहार स्थित साउथ सिटी पब्लिक स्कूल में बच्चे से उठक बैठक करवाने पर शिक्षक से नाराज परिजनों ने ऑफिस में घुस की मारपीट.!!
घटना का सीसीटीवी वीडियो आया सामने,हनुमंत विहार थाना अंतर्गत का मामला.!!#Kanpur #Crime #Schoolfight #gknews #basantvihar pic.twitter.com/1OHqxO2DwD
— Jr.Gaurav Kushwaha 🇮🇳 (@Gauravlivee) September 18, 2023