బెంగళూరు: రాత్రి వేళ వీధిలో నడిచి వెళ్తున్న మహిళలను ఒక వ్యక్తి అనుసరించాడు. ఒక మహిళను వెనుక నుంచి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. (Man Molesting Woman) ఆమె ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 3న రాత్రి వేళ బీటీఎం లేఅవుట్ ప్రాంతంలోని ఇరుకైన వీధిలో ఇద్దరు మహిళలు నడిచి వెళ్తున్నారు. ఒక వ్యక్తి వారి వెంటపడ్డాడు. జన సంచారం లేని ఆ వీధిలో ఒక మహిళను పట్టకుని లైంగికంగా వేధించాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ మహిళలు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. బాధిత మహిళలు ఫిర్యాదు చేయనప్పటికీ పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
बेंगलुरु में एक महिला के साथ सड़क पर यौन उत्पीड़न हुआ और यह घटना सीसीटीवी में रिकॉर्ड हो गई। जांच शुरू हो गई है।#Bengaluru #Video #CCTV #CCTVFootage #assault pic.twitter.com/662tFAvF6X
— Ashish rai (@journorai) April 6, 2025