‘ఎన్విడియా’ సీఈవోకు చైనా గూఢచారి ‘వలపువల’!
చైనా గూఢచారిగా అనుమానిస్తున్న అలిస్ హువాంగ్‌తో తనకు వివాహేతర సంబంధం ఉందని ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ అంగీకరించారు. అలిస్ జెన్సన్‌తో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని ఆ తర్వాత సున్నితమైన సమాచారాన్ని చైనాకు బదిలీ చేసినట్టు వార్తా కథనాలు చెప్తున్నాయి. ఏఐ చిప్‌ల అతిపెద్ద సరఫరాదారు అయిన ఎన్విడియా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నది.
- దొడ్డిదారిన చైనాకు ఏఐ చిప్‌ల తరలింపు
- చైనా గూఢచర్యంపై ట్రంప్‌కు ముందే సమాచారం!
- అయినప్పటికీ ట్రంప్ చైనా పర్యటనలో జెన్సన్కు చోటు
- మాపై బురద చల్లే ప్రయత్నం: చైనా
న్యూఢిల్లీ: చైనా గూఢచారిగా అనుమానిస్తున్న అలిస్ హువాంగ్‌తో తనకు వివాహేతర సంబంధం ఉందని ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ అంగీకరించారు. అలిస్ జెన్సన్‌తో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని ఆ తర్వాత సున్నితమైన సమాచారాన్ని చైనాకు బదిలీ చేసినట్టు వార్తా కథనాలు చెప్తున్నాయి. ఏఐ చిప్‌ల అతిపెద్ద సరఫరాదారు అయిన ఎన్విడియా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నది. అలిస్ ఒక చైనా జాతీయురాలు. సింగపూర్‌కు చెందిన డాటా సెంటర్ కంపెనీ మెగాస్పీడ్లో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఈ కంపెనీ ఎన్విడియా చిప్‌లతో పనిచేసే ఏఐ పరికరాలను కొనుగోలు చేసి చైనా దిగ్గజం అలీబాబాతో సహా పలు వ్యాపార సంస్థలకు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అద్దెకు ఇస్తుంది. చైనాకు ఎన్విడియా చిప్‌లను అక్రమంగా తరలించడంలో ఆమె సహాయపడిందనే అనుమానం ఉంది.
అసలేం జరిగింది?
తైపీలో జరిగిన ఒక సమావేశంలో ఆలిస్ హువాంగ్, జెన్సన్ హువాంగ్ కలిసి ఫొటో దిగిన సమయంలో ఆమె కంపెనీ అయిన మెగాస్పీడ్ 2024లో బిలియన్ల డాలర్ల విలువైన అధునాతన ఎన్విడియా ఏఐ చిప్‌లను కొనుగోలు చేయడం ప్రారంభించింది. మెగాస్పీడ్ చైనా టెక్నాలజీ దిగ్గజం అలీబాబాకు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అద్దెకు ఇస్తుంది. ఈ ఏర్పాటు నిషేధిత ఎన్విడియా చిప్‌లు పరోక్షంగా చైనాకు చేరడానికి సహాయపడిందని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు.
ఎన్విడియా సూపర్ కంప్యూటర్లను ప్రధానంగా సమీకరించే గిగాబైట్ సంస్థలోని నాయకులతో సహా ఏఐ చిప్ పరిశ్రమలోని ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లతో కూడా ఆలిస్ హువాంగ్‌కు సంబంధాలు ఉండేవి. వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఆ నిఘా నివేదికలను నిరాధారమైనవిగా, చైనాపై బురదచల్లే ప్రచారంగా కొట్టివేసింది. అలిస్పై అమెరికా సాగిస్తున్న నిఘా గురించి గురించి సుమారు ఏడాది క్రితమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తెలుసని న్యూయార్క్ టైమ్స్ గతంలో పేర్కొంది. అయినా ఇటీవల తన చైనా పర్యటనలో జెన్సన్కు ట్రంప్ చోటు కల్పించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

