Gujarat CM | సీఎం పదవి మళ్లీ మిస్.. బాధ లేదంటూనే కంటతడి పెట్టిన నితిన్
గుజరాత్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలుసు కదా. సీఎం ( Gujarat CM ) పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడం.. ఆ మరుసటి రోజే తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్‌కు ఆ పదవి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.

అహ్మదాబాద్: గుజరాత్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలుసు కదా. సీఎం ( Gujarat CM ) పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడం.. ఆ మరుసటి రోజే తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్‌కు ఆ పదవి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో ఆ పదవి ఆశించిన డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. రూపానీ రాజీనామా తర్వాత సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నది నితిన్ పటేలే. కానీ బీజేపీ మాత్రం పెద్దగా పేరు లేని భూపేంద్రను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. అయితే పదవి మరోసారి మిస్సయినా తనకేమీ బాధ లేదని అన్నారు నితిన్ పటేల్. సోమవారం భూపేంద్రను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన నితిన్.. కంటతడి పెట్టడం గమనార్హం.
తన కోసం పార్టీ ఎంతో చేసిందని, పదవి రానందుకు తానేమీ అసంతృప్తిగా లేనని నితిన్ అన్నారు. సోమవారం ప్రమాణ స్వీకారానికి ముందు తనను కలవాల్సిందిగా భూపేంద్ర.. నితిన్‌ను కోరారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లిన నితిన్.. శుభాకాంక్షలు చెప్పారు. భూపేంద్ర పటేల్ మా కుటుంబ స్నేహితుడు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పాను. సీఎంగా ఆయన ప్రమాణం చేయడం సంతోషంగా ఉంది. ఎప్పుడు అవసరం అయినా నా గైడెన్స్ కావాలని ఆయన అడిగారు. నేనేమీ అసంతృప్తిగా లేను. 18 ఏళ్ల వయసు నుంచీ బీజేపీతో పని చేస్తున్నాను. ఇలాగే కొనసాగుతాను. పార్టీలో నాకు ఓ స్థాయి వచ్చినా రాకపోయినా.. ఇలాగే సేవ చేస్తాను అని నితిన్ పటేల్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

