Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Fire Accident | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని నోయిడా (Noida) లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలు దుకాణాలు అగ్నికి ఆహూతయ్యాయి. నోయిడా సెక్టార్ 125లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టీ (Tea), స్నాక్స్ (Snacks) దుకాణాల్లో తొలుత మంటలు చెలరేగాయి.
Fire Accident : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని నోయిడా (Noida) లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలు దుకాణాలు అగ్నికి ఆహూతయ్యాయి. నోయిడా సెక్టార్ 125లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టీ (Tea), స్నాక్స్ (Snacks) దుకాణాల్లో తొలుత మంటలు చెలరేగాయి. సెక్టార్ 126 పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఐదు దుకాణాలకు మంటలు వేగంగా వ్యాపించాయి.
ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాద సమయంలో దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని అలుముకోవడంతో అధికారులు ముందుజాగ్రత్తగా సమీపంలోని రహదారులను మూసివేసి సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యల సమయంలో ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు.
వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో ఎల్పీజీ సిలిండర్లు ఉన్నాయని, వాటి కారణంగా మరింత ప్రమాదాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నోయిడా చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

