Anti-defection law| ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించే యోచన లేదు.. పార్లమెంట్లో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
Anti-defection law| న్యూఢిల్లీ: ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో తెలిపింది. ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులు తమ పార్టీని ఫిరాయించకుండా నిరోధించేందుకు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో నిబంధనలు పొందుపరిచారు. పదో షెడ్యూల్‌ని కానీ, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కానీ సవరించే యోచన లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. చట్ట సవరణపై లోక్‌సభ స్పీకర్ గత జూలైలో నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలిపారు.
చట్టాన్ని అధ్యయనం చేసేందుకు నియమించిన కమిటీ సభ్యుల్లో రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సభాపతికి మరిన్ని అధికారాలు కల్పించాలని మెజార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు. పార్టీ అధ్యక్షుడికి అధికారం కల్పించాలని మరికొంత మంది సభ్యులు సూచించారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో పార్టీలోకి ఫిరాయిస్తున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినతరం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

