UP CM Yogi | యూపీలో బక్రీద్ వేళ రోడ్లపై నమాజ్, జంతుబలి నిషేధం.. సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్
UP CM Yogi : దేశంలోని ముస్లింలంతా బక్రీద్‌కు సిద్ధమవుతున్న వేళ ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక సూచనలు చేశారు. యూపీలోని రోడ్లపై లేదా బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయడాన్ని, జంతు బలులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
UP CM Yogi : దేశంలోని ముస్లింలంతా బక్రీద్‌కు సిద్ధమవుతున్న వేళ ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక సూచనలు చేశారు. యూపీలోని రోడ్లపై లేదా బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయడాన్ని, జంతు బలులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూపీలో బక్రీద్ నిర్వహణపై ఆదివారం సీఎం యోగి.. ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.
అనంతరం బక్రీద్‌పై అధికారులకు కీలక సూచనలు చేశారు. పది అంశాలను సూచిస్తూ, వాటిని అమలు చేయాలన్నారు. ఆయన ఆదేశాల ప్రకారం.. మసీదులలో మినహా ఎక్కడా నమాజ్ చేయడానికి వీల్లేదు. రోడ్లపై లేదా పబ్లిక్ ప్లేసులు వంటి ఎలాంటి బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయకూడదు. అలాగే, జంతు బలులు కూడా నిషేధం. రోడ్లను బ్లాక్ చేయకూడదు. ఒకవేళ ప్రార్థనలు చేసే వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటే, షిఫ్టుల వారీగా చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో జంతు బలులు చేయకూడదు. అలాగే, నిషేధించిన జంతువులను వధించినా కూడా చర్యలు తీసుకుంటారు. జంతుబలుల తర్వాత ఆ ప్రదేశాల్ని పూర్తి పరిశుభ్రంగా ఉంచాలి.
ఎలాంటి అపరిశుభ్రతకు తావివ్వకూడదు. చెత్త, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకూడదు. అలాగే, అవాంఛిత ఘటనలకు పాల్పడేవారిపై, శాంతి భద్రతలకు విఘాతం కల్పించేవారిపై కఠినంగా వ్యవహరించాలి. తగినంతగా భద్రతను మోహరించాలి. ముఖ్యంగా సున్నిత ప్రాంతాలను గుర్తించి భద్రత పెంచాలి. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం శాంతి భద్రతల్ని పర్యవేక్షించాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

