Delhi Incident | అంజలితోపాటు మరో యువతి కూడా.. సీసీటీవీ ఫుటేజ్ వైరల్..!
తాజాగా మరో ఘటన బయటపడింది. ప్రమాద సమయంలో అంజలితోపాటు మరో యువతి కూడా ఉన్నట్లు తాజాగా బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. కొత్త ఏడాది సందర్భంగా పార్టీ అనంతరం వీరిద్దరూ స్కూటీలో బయలు దేరినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే, దారి మధ్యలో వీరు ప్రయాణిస్తున్న స్కూటీని కారు ఢీ కొట్టడంతో కిందపడిపోయి తీవ్ర గాయాలైన నిధి.. భయంతో అక్కడి నుంచి పారిపోయి ఇంటికి చేరి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సదరు యువతి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని.. ఆమెను గుర్తించి విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడొచ్చని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
Delhi Incident | దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సంవత్సరం వేళ దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. స్కూటీలో వెళ్తున్న ఓ యువతిని ఢీ కొట్టిన కారు.. అనంతరం ఆమెను 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 ఏండ్ల వయసున్న అంజలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. యువతిని కారు ఈడ్చుకెళ్లడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా, కేసు దర్యాప్తు నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో ఘటన బయటపడింది. ప్రమాద సమయంలో అంజలితోపాటు మరో యువతి కూడా ఉన్నట్లు తాజాగా బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది.
ఆమె అంజలి స్నేహితురాలు నిధి అని.. కొత్త ఏడాది సందర్భంగా పార్టీ అనంతరం వీరిద్దరూ స్కూటీలో బయలు దేరినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే, దారి మధ్యలో వీరు ప్రయాణిస్తున్న స్కూటీని కారు ఢీ కొట్టడంతో కిందపడిపోయి తీవ్ర గాయాలైన నిధి.. భయంతో అక్కడి నుంచి పారిపోయి ఇంటికి చేరి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సదరు యువతి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని.. ఆమెను గుర్తించి విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడొచ్చని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
#WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area.
(CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze
— ANI (@ANI) January 3, 2023
ఘటన వివరాలు…
శనివారం అర్ధరాత్రి ఢిల్లీ శివారులోని కాంజావాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు జరుగుతుందన్నారు. నిందితులను ఘటనాస్థలికి కూడా తీసుకెళ్లి.. విచారిస్తామని చెప్పారు. దర్యాప్తు వివరాలను మృతురాలి పేరెంట్స్‌కు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. అయితే బాధితురాలి కాలు విరిగిపోవడం, బట్టలు లేకుండా ఉన్న ఓ ఫుటేజీ బయటకు వచ్చింది. దీంతో ఆమెపై అత్యాచారం జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఆమెపై అత్యాచారం జరగలేదని, కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా, ఈ ఘటనపై స్థానికులు, పలువురు మహిళా సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో భారీ పేలుడు శబ్దాలు.. భూకంపం వచ్చిందా? బ్లాస్టింగ్ జరిగిందా?
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో బీచ్‌లను మూసేసిన అధికారులు..!
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. ‘ఆదిపురుష్’తో పోలికలు,ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఎక్కడంటూ కామెంట్
AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
Rahul Gandhi: సత్యం శివం సుందరం.. శివుడి త్రిపుండ్రం పోస్టు పెట్టిన రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

