Tamil Nadu CM | నటుడి పార్టీ అని మమ్మల్ని ఎంతో మంది ఎగతాళి చేశారు : తమిళనాడు సీఎం
Tamil Nadu CM | తమిళనాడు అసెంబ్లీ (Tamil Nadu Assembly) లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా త్రిభాషా సూత్రం, నీట్ వివాదం (NEET Row), కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటన తదితర అంశాలను ప్రస్తావించారు. ఈ ప్రసంగం ద్వారా విజయ్ విమర్శకులకు గట్టిగా బదులిచ్చారు. ఎన్నో సవాళ్లను దాటి తాము అధికారంలోకి వచ్చామని, నటుడి పార్టీ అని తమను ఎంతోమంది ఎగతాళి చేశారని గుర్తుచేసుకున్నారు.
Tamil Nadu CM : తమిళనాడు అసెంబ్లీ (Tamil Nadu Assembly) లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా త్రిభాషా సూత్రం, నీట్ వివాదం (NEET Row), కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటన తదితర అంశాలను ప్రస్తావించారు. ఈ ప్రసంగం ద్వారా విజయ్ విమర్శకులకు గట్టిగా బదులిచ్చారు. ఎన్నో సవాళ్లను దాటి తాము అధికారంలోకి వచ్చామని, నటుడి పార్టీ అని తమను ఎంతోమంది ఎగతాళి చేశారని గుర్తుచేసుకున్నారు. తమకు ఈ అధికారం అంత సులువుగా వచ్చింది కాదని, తమిళనాడు ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు తాను, తన పార్టీ ఎన్నో కుట్రలు, సవాళ్లను అధిగమించాల్సి వచ్చిందని చెప్పారు.
తమది యాక్టర్ పార్టీ అని, తాను సినిమా షూటింగ్ నుంచి నేరుగా సీఎం కుర్చీలో కూర్చున్నానని చాలా మంది గేలి చేశారని విజయ్ వెల్లడించారు. అయితే అలాంటి విమర్శలను తాను పట్టించుకోనని అన్నారు. సాధారణంగా చాలా మంది రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తారని, కానీ తాను ప్రజల్లోకి వెళ్లిన తర్వాత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశానని, తనపై నమ్మకం ఉంచి ప్రజలు గెలిపించారని విజయ్ తెలిపారు. నీట్ వివాదంపై మాట్లాడుతూ.. నీట్ విధానం విద్యా వ్యవస్థలో అసమానతలను సృష్టిస్తోందని, దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తమిళనాడులో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయబోమని, ద్విభాషా విధానానికే తాము కట్టుబడి ఉన్నామని సీఎం పునరుద్ఘాటించారు. హిందీ భాషను రుద్దేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తాము ఎప్పటికీ అంగీకరించబోమన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనను విజయ్ ప్రస్తావించారు. ’41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాద ఘటన తనను ఎంత వేదనకు గురిచేసిందో మాటల్లో చెప్పలేనని అన్నారు. ఆ బాధ తనను ఎన్నటికీ వదలదని చెప్పారు. తొక్కిసలాట ఘటన విషయంలోనూ తమపైనే నిందలు వేశారని, ఇది అత్యంత దారుణమని అన్నారు.
రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయని సీఎం విజయ్ ఆవేదన వ్యక్తంచేశారు. వారసత్వ రాజకీయాల గురించి స్పందిస్తూ డీఎంకేపై విజయ్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కేవలం ఒక కుటుంబానికే (డీఎంకేను ఉద్దేశిస్తూ) ప్రాధాన్యమివ్వడం తమ రాజకీయ విధానం కాదన్నారు. తమిళనాడులోని ప్రతి కుటుంబానికి తాము సేవలు అందిస్తామని, అదే తమ రాజకీయం, అదే తమ పాలనా విధానం అని విజయ్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
రాంపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

