ఓ బలహీన వ్యక్తిని సీఎం చేయాలని అధిష్ఠానం చూస్తోంది : సిద్దూ సంచలన వ్యాఖ్యలు
Navjot Singh Sidhu | పంజాబ్ సీఎం అభ్యర్థి ఎంపిక అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. సీఎం చెన్నీ, పీసీసీ చీఫ్ సిద్దూ మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. ఎవర్ని ఎంపిక చేయాలో అధిష్ఠానానికి పాలుపోవడం లేదు. మరో వైపు సీఎం అభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ప్రకటిస్తారు. రాహుల్ ఆదివారం పంజాబ్ పర్యటనకు వెళ్తున్నారు. ఆ రోజే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ సిద్దూ అధిష్ఠానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్‌లో ఓ బలహీనమైన వ్యక్తిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని అధిష్ఠానం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అధిష్ఠానం చెప్పినట్లుగా నడుచుకునే వ్యక్తినే సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి సిద్ధమవుతున్నారని సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌ను కొత్త పుంతలు తొక్కించే బాధ్యత, ఛాన్స్ ముఖ్యమంత్రి చేతుల్లోనే వుంటుంది. మీరే ఈ సారి సీఎంను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఓ బలహీన వ్యక్తిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని, తాము చెప్పినట్లే నడుచుకునే లక్షణమున్న వ్యక్తిని పంజాబ్ సీఎం చేయాలన్నది అధిష్ఠానం ప్లాన్. అలాంటి ముఖ్యమంత్రి మీకు కావాలా? అంటూ సిద్దూ సూటిగా పార్టీ కార్యకర్తలను ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

