ముంబై : ముంబైలో హిజ్రా వేషంలో ఇంట్లోకి చొరబడి లైంగిక దాడికి పాల్పడిన అనిల్ షిండే(30) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంతానం కలిగించేందుకు పూజలు చేయడానికి వచ్చానని అతను ఆ మహిళను నమ్మించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడి, ఆ ఇంట్లోని రూ.2000 నగదు తీసుకుని పారిపోయాడని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం పొవాయ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షిండే చీర కట్టుకుని, తాను హిజ్రానని చెబుతూ, ఆ మహిళ ఇంట్లోనికి ప్రవేశించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఆధారంగా పోలీసులు నిందితుడు షిండే పరారైన ఆటోను గుర్తించారు. తరువాత అతనిని కల్వా ప్రాంతంలో అరెస్ట్ చేశారు.