ఎయిమ్స్ స్టడీ.. 50 ఏళ్ల లోపువారే ఎక్కువ సంఖ్యలో మృతి

న్యూఢిల్లీ: కోవిడ్ వల్ల 50 ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువ సంఖ్యలో చనిపోయినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ లో స్టడీకి సంబంధించిన ఫలితాలను ప్రచురించారు. ఎయిమ్స్ డైరక్టర్ రణ్‌దీప్ గులేరియా, ట్రామా సెంటర్ చీఫ్ డాక్టర్ రాజేశ్ మల్హోత్రా ఆధ్వర్యంలో ఆ స్టడీ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీ నుంచి జూలై 24వ తేదీ మధ్య నమోదు అయిన మరణాల ఆధారంగా ఈ విషయాన్ని చెప్పారు. అధ్యయనం నిర్వహించిన సమయంలో.. 654 మంది మధ్యవయసు రోగులను ఐసీయూలో అడ్మిట్ చేశారు. దాంట్లో 247 మంది చనిపోయారు. మృతులను పలు ఏజ్ గ్రూపులుగా విభజించారు. అయితే 18 నుంచి 50 ఏళ్ల వారిలో 42.1 శాతం మంది మరణించినట్లు గుర్తించారు. ఇక 51 నుంచి 65 ఏళ్లు ఉన్నవారిలో 34.8 శాతం చనిపోయారు. 65 ప్లస్ ఏజ్ గ్రూపులో మరణించిన వారి సంఖ్య 23.1 శాతంగా ఉంది. హై బీపీ, డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్లు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక జ్వరం, శ్వాస ఆడకపోవడం లాంటి స్వల్ప లక్షణాలతో కొందరు ఇబ్బందిపడ్డారు. పీడియాట్రిక్ గ్రూపులోనూ 46 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కరోనా వల్ల ఆ గ్రూపునకు చెందిన ఆరుగురు మృతిచెందారు. పీడియాట్రిక్ గ్రూపులో మరణాల సంఖ్య 13 శాతంగా ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

