Parliament | ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం..!
Parliament | ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది కొత్త బిల్లులను పార్లమెంట్‌కు సమర్పించనున్నది. ఇందులో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన బిల్లు సైతం ఉన్నది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Parliament | ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది కొత్త బిల్లులను పార్లమెంట్‌కు సమర్పించనున్నది. ఇందులో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన బిల్లు సైతం ఉన్నది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించే ఉద్దేశం కేంద్రానికి లేదని తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి పాలన కోసం ప్రభుత్వం ప్రతి ఆరునెలలకోసారి పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన గడువు ఆగస్టు 13తో ముగియనున్నది.
అలాగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వి మణిపూర్ వస్తువులు, సేవల పన్ను (సవరణ) బిల్లు 2025, పబ్లిక్ ట్రస్ట్ (నిబంధనల సవరణ) బిల్లు 2025, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (సవరణ) బిల్లు 2025, పన్ను చట్టాలు (సవరణ) బిల్లు 2025, జియో-హెరిటేజ్ సైట్స్ అండ్ జియో-రిమైన్లు (సంరక్షణ-నిర్వహణ) బిల్లు 2025, గనులు-క్వారీలు (అభివృద్ధి-నియంత్రణ) సవరణ బిల్లు 2025, జాతీయ క్రీడా పరిపాలన బిల్లు 2025, జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు 2025లను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని చూస్తున్నది. దాంతో పాటు గోవా రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లు 2024, మర్చంట్ షిప్పింగ్ బిల్లు 2024, ఇండియన్ పోర్ట్స్ బిల్లు 2025, ఆదాయపు పన్ను బిల్లు 2025 కూడా లోక్‌సభలో ఆమోదం పొందే అవకాశాలున్నాయి. ఏప్రిల్ నెలలో ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల్లో కేంద్రం 16 బిల్లులను ఆమోదించాయి. బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే, కానీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక సమర్పించిన తర్వాత.. వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 ఆమోదం పొందింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

