MLA Becomes MinisterTwice | ఎంపీలో విచిత్రం.. 15 నిమిషాల్లో రెండుసార్లు మంత్రిగా ఎమ్మెల్యే ప్రమాణం
MLA Becomes MinisterTwice | ఒక ఎమ్మెల్యే 15 నిమిషాల్లో రెండుసార్లు మంత్రి అయ్యారు. రొటీన్‌కు భిన్నంగా విచిత్రంగా మంత్రిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ అసాధారణ సంఘటన జరిగింది.
భోపాల్: ఒక ఎమ్మెల్యే 15 నిమిషాల్లో రెండు సార్లు మంత్రి అయ్యారు. (MLA Becomes Minister Twice) రొటీన్‌కు భిన్నంగా విచిత్రంగా మంత్రిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ అసాధారణ సంఘటన జరిగింది. ఏప్రిల్‌లో బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంనివాస్ రావత్‌ను సీఎం మోహన్ యాదవ్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే రొటీన్‌కు భిన్నంగా మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. సోమవారం ఉదయం 9.03 గంటలకు రాజ్‌భవన్‌లో రాంనివాస్ రావత్‌తో గవర్నర్ మంగూభాయ్ సీ పటేల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జూనియర్ పదవి ఉన్న మంత్రిగా తొలుత ఆయన ప్రమాణం చేశారు.
కాగా, 15 నిమిషాల తర్వాత రాంనివాస్ రావత్ క్యాబినెట్ మంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అసాధారణంగా రెండుసార్లు మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా, పార్టీ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యేగా ఉన్న రావత్ మంత్రిగా ఎలా ప్రమాణ స్వీకారం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. బీజేపీలో చేరిన రావత్‌తోపాటు నిర్మలా సప్రేపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్‌ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.
మరోవైపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాంనివాస్ రావత్ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను మంత్రిని చేసినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఆరోపణలు చేసే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ‘వాళ్లు (కాంగ్రెస్) నాకు ఏమీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం నన్ను గౌరవించింది’ అని తెలిపారు. అలాగే తన అసాధారణ ప్రమాణ స్వీకారం గురించి ఆయన వివరణ ఇచ్చారు. ‘పొరపాటున ‘క’ పదం మిస్ అయ్యింది. అందుకే రెండుసార్లు ప్రమాణం చేశాను. అరగంటలో రెండుసార్లు ప్రమాణం చేసిన మొదటి మంత్రిని నేనే’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

