Microsoft Cloud Outage | స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు.. అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం..!
Microsoft Cloud Outage | ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం కలుగుతున్నది. పలు కంప్యూటర్లలో విండోస్-11, విండోస్-10 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్‌తో నడిచే కంప్యూటర్లు, లాప్‌టాప్‌లలో బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తున్నది. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాతో పలు దేశాల్లో ఈ సమస్య ఉత్పన్నమైంది.
Microsoft Cloud Outage | ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం కలుగుతున్నది. పలు కంప్యూటర్లలో విండోస్-11, విండోస్-10 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్‌తో నడిచే కంప్యూటర్లు, లాప్‌టాప్‌లలో బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తున్నది. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాతో పలు దేశాల్లో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ ఎర్రర్ కారణంగా అంతర్జాతీయ స్థాయిలో విమానాలు, బ్యాంకులు, స్టోరేజీ మీడియా సేవలకు అంతరాయం కలుగుతున్నది. ఈ క్రమంలో భారత్‌లో విమాన సర్వీసుల్లో అంతరాయం కలుగుతున్నది. ఇండిగో, స్పైస్‌జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్ సేవలు స్తంభించాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే, స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నిలిచిపోయింది.
ఈ క్రమంలో కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అడ్వైజరీలో ఇటీవల మైక్రోసాఫ్ట్ క్రౌడ్‌స్ట్రయిక్ ఏజెంట్ ఫాల్కన్ సెన్సార్ కోసం అప్డేట్ను విడుదల చేసిందని పేర్కొంది. ఆ అప్డేట్ కారణంగా సమస్య ఏర్పడిందని CERT-In తెలిపింది. దీని కారణంగా చాలా వ్యవస్థలు స్తంభించినట్లుగా పేర్కొంది. అలాగే, యూఏఈకి చెందిన సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సైతం పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. మెరుగైన భద్రత కోసం గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేయాలని సూచించింది. గూగుల్ విడుదల చేసిన కొత్త క్రోమ్ అప్డేట్ ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేయాలని చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

