వైద్యులందరికీ ప్రత్యేక ఐడీలు
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఇటీవల ప్రారంభించిన పోర్టల్‌లో వైద్యుల నమోదు ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో ప్రాక్టీస్ చేయడానికి అర్హులైన ఎంబీబీఎస్ వైద్యులందరూ ఇందులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఎన్ఎంఆర్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి
- ఎన్ఎంసీ వెల్లడి
న్యూఢిల్లీ: నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఇటీవల ప్రారంభించిన పోర్టల్‌లో వైద్యుల నమోదు ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో ప్రాక్టీస్ చేయడానికి అర్హులైన ఎంబీబీఎస్ వైద్యులందరూ ఇందులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలా నమోదు చేసుకున్న వారికి విశిష్ట గుర్తింపు ఐడీని కేటాయిస్తారు. నేషనల్ మెడికల్ రిజిస్టర్(ఎన్ఎంఆర్) అనేది ఒక డైనమిక్ డాటాబేస్. ఇందులో వైద్యుల ప్రామాణికతను ఆధార్ ద్వారా ధ్రువీకరిస్తారు. రిజిస్ట్రేషన్‌కు ఎన్ఎంఆర్ సిద్ధంగా ఉన్నదని, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు (ఆర్ఎంపీలు) అందరూ తక్షణమే ఇందులో నమోదు చేసుకోవాలని ఎన్ఎంసీ కార్యదర్శి డాక్టర్ బి శ్రీనివాస్ తెలిపారు.
ఇండియన్ మెడికల్ రిజిస్టర్ (ఐఎంఆర్) వద్ద నమోదుచేసుకున్న ఎంబీబీఎస్ వైద్యులు కూడా ఎన్‌ఎంఆర్‌లో మరోమారు రిజిస్టర్ చేసుకోవాలని నోటీస్ జారీ అయ్యింది. దీని ప్రకారం, పోర్టల్‌లో వైద్యులకు సంబంధించిన సమాచారం కొంత ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ‘హెల్త్ కేర్ ప్రొవైడర్ రిజిస్ట్రీ’లోనూ వైద్యులు చేరేందుకు ఆప్షన్‌ను తీసుకొచ్చారు. ‘దేశంలో ఇప్పటివరకు ఎంతమంది అర్హులైన వైద్యులున్నారు? విదేశాలకు వెళ్లినవారెంత మంది? డాక్టర్‌గా లైసెన్స్ కోల్పోయిన వాళ్లెంత మంది? సమగ్రమైన డాటా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఎన్ఎంఆర్ పోర్టల్‌ను తీసుకొచ్చారు. దాదాపు 13 లక్షల మంది వైద్యుల డాటా పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది’ అని ఎన్ఎంసీ అధికారి ఒకరు చెప్పారు.
వెరిఫికేషన్ అయ్యాకే ఐడీ జారీ
ఆధార్ ఐడీ, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికెట్ డిజిటల్ కాపీ, ఎంసీఐ లేదా రాష్ట్ర స్థాయి స్టేట్ మెడికల్ కౌన్సిల్ జారీచేసిన సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ సమయంలో వైద్యులు సమర్పించాల్సి ఉంటుంది. వైద్యుడు సమర్పించిన పత్రాలను సంబంధిత స్టేట్ మెడికల్ కౌన్సిల్‌కు పంపి ధృవీకరిస్తారు. దరఖాస్తులోని వివరాలు సరైనవా?కావా? అన్నది సంబంధిత వైద్య కాలేజీకి పంపి నిర్ధారిస్తారు. వివరాలన్నీ సరైనవేనని తేలాక.. దరఖాస్తు తిరిగి ఎన్ఎంసీకి చేరుతుంది. అటు తర్వాత ఎన్ఎంసీ నుంచి సదరు వైద్యుడికి విశిష్ట గుర్తింపు ‘ఎన్ఎంఆర్ ఐడీ’ జారీ అవుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కరువు తెచ్చి.. వరి వద్దంటరా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Anirudh Reddy | 40 కోట్ల బిల్లులిస్తరా.. చావమంటరా?.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
Power Cuts | వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లకు విద్యుత్ షాక్.. కరెంటు కోతలతో ఒక్కో ట్యాంకర్ డెలివరీకి 3, 4 రోజుల సమయం
Farmers Self Declaration | రైతులకే డిక్లరేషన్ ఎందుకు.. ప్రజావాణిలో నిలదీసిన అన్నదాత
Balmoor Venkat | పొలం దారి ఆక్రమించిన బల్మూరి.. చంపేస్తమని బెదిరింపులు.. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

