MEA | కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించిన భారత్.. అమిత్ షాపై ఆరోపణలపై అసంతృప్తి..
MEA | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కెనడా మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించామని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
MEA | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కెనడా మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించామని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. కమిటీ ముందు హోంశాఖ మంత్రి షా గురించి కెనడా మంత్రి డేవిడ్ మారిసన్ చేసిన నిరాధారమైన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా నిరసిస్తోందన్నారు. భారత్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు, ఇతర దేశాలను ప్రభావితం చేసే వ్యూహంలో భాగంగా కెనడా ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే అంతర్జాతీయ మీడియాకు లీక్ ఇస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారహిత చర్యలు ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర పరిణామాలను కలిగిస్తాయని హెచ్చరించారు.
ఇటీవల కెనడా ఖలిస్తానీ ఉగ్రవాది హత్యకుట్రలో భారత కేంద్ర మంత్రి అమిత్ షా పేరును ప్రస్తావించింది. ఆ దేశ విదేశాంగ వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ డేవిడ్ మారిసన్ లీకుల ఆధారంగా ది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కథనం ప్రచురించింది. లీకులను తాను చేసినట్లుగా మారిసన్ అంగీకరించారు. ఈ కుట్ర వెనుక అమిత్ షా హస్తమున్నదని తానే వాషింగ్టన్ పోస్టుకు చెప్పానని కెనడా పార్లమెంటరీ ప్యానెల్ ఎదుట డేవిడ్ మారిసన్ అంగీకరించారు. ఆ పత్రిక జర్నలిస్టు తనకు కాల్ చేసి ఆ కుట్ర వెనుక ఉన్నది ఆయనే (అమిత్ షా) నా అని అడిగారని.. ఔనని చెప్పినట్లు వివరించారు. భారత అధికారులు, అమిత్ షా ప్రమేయం ఉన్నదని కెనడా అధికారులు చెప్పారంటూ ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఇటీవల ఓ కథనం ప్రచురించింది. అయితే, కెనడా అధికారులు మాత్రం ఇందుకు ఆధారాలు చూపడంలో విఫలమయ్యారు. ఈ వ్యవహారంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

