Ayodhya | అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం.. ఆ దేశంలో ఉద్యోగులకు ప్రత్యేక సెలవు..!
Ayodhya | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు హిందూ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 22న రెండు గంటల ప్రత్యేక సెలవును మారిషస్ ప్రభుత్వం ప్రకటించింది.
Ayodhya | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు హిందూ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 22న రెండు గంటల ప్రత్యేక సెలవును మారిషస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో మారిషస్‌లోని హిందూ ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 22న జరిగే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసే అవకాశం దక్కనున్నది. ఈ ప్రత్యేక సెలవుదినం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటల పాటు ఉండనున్నది. మారిషస్ జనాభాలో 48.5శాతం హిందువులు ఉన్నారు. సెంటిమెంట్లు, సంప్రదాయాలను గౌరవించేందుకు ఇదో చిన్న ప్రయత్నమని మారిషస్ పీఎం ప్రవింద్ జుగ్నాథ్ పేర్కొన్నారు.
భారత్‌లో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల ప్రత్యేక సెలవును మంజూరు చేయడానికి మంత్రివర్గం అంగీకరించినట్లు ప్రధాన మంత్రి ప్రవింద్ జుగ్నాథ్ నేతృత్వంలోని మారిషస్ క్యాబినెట్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. జనవరి 22న అయోధ్యలో కొత్తగా నిర్మించిన అయోధ్య రాముడి గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు. రామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని రంగాలకు చెందిన పలువురు నేతలు, ప్రముఖులను ఆహ్వానించారు. 50కి పైగా దేశాలకు చెందిన ప్రముఖులు కూడా దీక్షా కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

