ఎదురు కాల్పుల్లో మావోయిస్టు హతం
మావోయిస్టు హతం | ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. మృతిచెందిన మావోయిస్టును వెట్టి హుంగాగా గుర్తించారు.

దంతెవాడ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో తుపాకులు మరోసారి గర్జించాయి. గాడం-జంగంపాల్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్‌కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ఓ మోస్టు వాంటెడ్ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు తెలిపారు.
ఇతడిపై రూ. లక్ష రివార్డు ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతిచెందిన మావోయిస్టును వెట్టి హుంగాగా గుర్తించారు. ఎన్కౌంటర్లో మరికొందరు మావోయిస్టులు మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనాస్థలం నుంచి ఓ 8ఎంఎం పిస్టల్, నాటు తుపాకీ, 2 కిలోల ఐఈడీతోపాటు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందర్ రాజ్ తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం బీజాపూర్ జిల్లాలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ఐదు వాహనాలను మావోయిస్టులు తగులబెట్టారు. నైమిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
బీజాపూర్ పట్టణానికి మింగాచల్ నది నుంచి తాగునీటిని సరఫరా చేసేందుకు నది ఒడ్డున వాటర్ ప్లాంట్‌ను నిర్మిస్తుండగా నక్సల్స్ ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

