మనీష్ సిసోడియా బ్యాంకు లాకర్లలో సీబీఐ సోదాలు
సీబీఐ దాడుల్లో తన బ్యాంక్ లాకర్లో ఏమీ గుర్తించలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు. తనకు క్లీన్చిట్ లభించడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు.
న్యూఢిల్లీ : సీబీఐ దాడుల్లో తన బ్యాంక్ లాకర్లో ఏమీ గుర్తించలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు. తనకు క్లీన్చిట్ లభించడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. సీబీఐ అధికారులకు తాము పూర్తిగా సహకరించామని, వారు కూడా తమను బాగా చూసుకున్నారని చెప్పుకొచ్చారు. సత్యం గెలిచిందని సిసోడియా వ్యాఖ్యానించారు. సీబీఐ అధికారులు మంగళవారం ఘజియాబాద్‌లోని పీఎన్బీ బ్రాంచ్‌లో మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్లలో సోదాలు నిర్వహించారు.
తాను ఎలాంటి తప్పూ చేయలేదని సిసోడియా ఈ సందర్భంగా అన్నారు. సత్యం గెలిచిందని, తాను పైసా కూడా అవకతవకలకు పాల్పడలేదని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో అవినీతి ఆరోపణలపై బీజేపీ, ఆప్ సభ్యుల మధ్య డైలాగ్ వార్ ముదిరింది. అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా రాజీనామా చేయాలని ఆప్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
సభా కార్యక్రమాలను కొనసాగించేలా సభ్యులు సహకరించాలని డిప్యూటీ స్పీకర్ కోరినా గందరగోళం నెలకొంది. ఎల్జీ అవినీతిపై తాము దర్యాప్తునకు పట్టుబడుతుంటే విపక్ష నేతలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆప్ ప్రతినిధి సౌరవ్ భరద్వాజ్ బీజేపీ సభ్యులను నిలదీశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

