Snake Bites Man Every Saturday | ప్రతి శనివారం వ్యక్తిని కాటేస్తున్న పాము.. ఆశ్చర్యపోతున్న డాక్టర్లు
Snake Bites Man Every Saturday | శనివారం వస్తుందంటే ఒక వ్యక్తి హడలిపోతున్నాడు. ప్రతి శనివారం ఒక పాము అతడ్ని కాటేస్తోంది. 40 రోజుల్లో ఏడుసార్లు పాము కాటుకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఒక్క రోజులోనే కోలుకుంటున్నాడు. ఈ విషయం తెలిసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.
లక్నో: శనివారం వస్తుందంటే ఒక వ్యక్తి హడలిపోతున్నాడు. ప్రతి శనివారం ఒక పాము అతడ్ని కాటేస్తోంది. (Snake Bites Man Every Saturday) 40 రోజుల్లో ఏడుసార్లు పాము కాటుకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఒక్క రోజులోనే కోలుకుంటున్నాడు. ఈ విషయం తెలిసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సౌర గ్రామానికి చెందిన 24 ఏళ్ల వికాస్ దూబేను ప్రతి శనివారం పాము కాటేస్తున్నది. దీంతో ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్న అతడు ఒక్క రోజులో కోలుకుంటున్నాడు.
జూన్ 1న ఇంట్లో నిద్రించిన వికాస్ బెడ్ నుంచి కిందకు దిగిన తర్వాత తొలిసారి పాము కాటేసింది. రాధా నగర్‌లోని బంధువు ఇంట్లో నాలుగోసారి, తాజాగా జూలై 6న మరో బంధువుల ఇంటికి వెళ్లిన అతడు పాము కాటుకు గురయ్యాడు. ఇలా 40 రోజుల్లో ఏడుసార్లు అతడ్ని పాము కాటేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 9వ సారి పాము కాటు వేస్తే అతడు మరణిస్తాడని జ్యోతిష్కులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, ప్రతి శనివారం పాము కాటుకు గురవుతున్న వికాస్ దూబే శుక్రవారం వైద్య ఖర్చుల కోసం కలెక్టరేట్‌కు వెళ్లాడు. పాము కాటు చికిత్సకు ఇప్పటికే చాలా ఖర్చు అయ్యిందని అధికారుల ముందు ఏడ్చాడు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని వేడుకున్నాడు.
మరోవైపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ నయన్ గిరి ఈ విషయంపై స్పందించారు. పాము కాటు విరుగుడు మందుతోపాటు ఉచిత చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని వికాస్ దూబేకు సూచించారు. అలాగే ప్రతి శనివారం అతడ్ని పాము కాటు వేయడం చాలా విచిత్రంగా ఉందని అన్నారు. వికాస్‌ను నిజంగా పాము కాటేస్తుందో లేదో గుర్తించాలని, అతడికి చికిత్స చేస్తున్న వైద్యుడి సామర్థ్యాన్ని కూడా చూడాల్సి ఉందన్నారు.
‘ప్రతి శనివారం అతడు పాము కాటుకు గురవుతున్నాడు. అదే ఆసుపత్రిలో చేరుతున్నాడు. ప్రతిసారీ కేవలం ఒక రోజులో కోలుకోవడం కూడా వింతగా అనిపిస్తోంది’ అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ మీడియాతో అన్నారు. ఈ విషయంపై దర్యాప్తు కోసం ముగ్గురు వైద్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పరిశీలించిన తర్వాత వాస్తవాన్ని ప్రజలకు చెబుతామని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

