Madhya Pradesh | అంత్యక్రియల్లో తమ్ముడితో వివాదం.. తండ్రి మృతదేహాన్ని సగం కోసివ్వమన్న అన్న
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించే విషయంలో తమ్ముడితో తలెత్తిన వివాదం కారణంగా తండ్రి మృతదేహంలో సగ భాగాన్ని కోసి ఇవ్వాలని ఓ కొడుకు డిమాండ్ చేసిన ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. టీకంగఢ్ జిల్లా లిఢోరతాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
- అంత్యక్రియల్లో గొడవ చేసిన అన్న
- పోలీసుల జోక్యంతో పరిష్కారం
Madhya Pradesh | టీకంగఢ్: తండ్రికి అంత్యక్రియలు నిర్వహించే విషయంలో తమ్ముడితో తలెత్తిన వివాదం కారణంగా తండ్రి మృతదేహంలో సగ భాగాన్ని కోసి ఇవ్వాలని ఓ కొడుకు డిమాండ్ చేసిన ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. టీకంగఢ్ జిల్లా లిఢోరతాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన దైనీ సింగ్ ఘోష్(84) అనే వ్యక్తి తన చిన్న కొడుకు దేశ్ రాజ్ వద్ద నివసిస్తూ ఆదివారం మృతి చెందాడు.
ఈ విషయం తెలిసి గ్రామం బయట నివసిస్తున్న అతడి పెద్ద కొడుకు కిషన్ తమ్ముడి ఇంటికి వచ్చాడు. తండ్రి అంత్యక్రియలను తానే నిర్వహిస్తానని పట్టుబట్టాడు. అయితే తాను అంత్యక్రియలు నిర్వహించాలన్నది తన తండ్రి చివరి కోరికని దేశ్రాజ్ అన్నకు తెలిపాడు. దీంతో తమ్ముడితో గొడవకు దిగిన కిషన్ తండ్రి శరీరాన్ని సగం కోసి తనకు ఇవ్వాలన్నాడు. గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి కిషన్‌కు సర్ది చెప్పడంతో అతడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దేశ్రాజ్ తన తండ్రి దహన సంస్కారాలు నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

