Lok Sabha Elections | ఏప్రిల్ 16 నుంచి లోక్‌సభ ఎన్నికలు.. ఢిల్లీ సీఈవో అంతర్గత నోట్ వైరల్..!
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలపై ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి జారీచేసిన ఓ అంతర్గత నోట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఏప్రిల్ 16ను లోక్‌సభ ఎన్నికలకు రిఫరెన్స్ తేదీగా పేర్కొంటూ ఢిల్లీ సీఈవో జారీచేసిన నోట్ వైరల్‌గా మారింది.
- రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
- అధికారులకు రిఫరెన్స్ కోసమే ఆ తేదీ
- ఢిల్లీ సీఈవో కార్యాలయం వివరణ
న్యూఢిల్లీ, జనవరి 23: సార్వత్రిక ఎన్నికలపై ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి జారీచేసిన ఓ అంతర్గత నోట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఏప్రిల్ 16ను లోక్‌సభ ఎన్నికలకు రిఫరెన్స్ తేదీగా పేర్కొంటూ ఢిల్లీ సీఈవో జారీచేసిన నోట్ వైరల్‌గా మారింది. ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయని, ఏప్రిల్ 16ను తాత్కాలిక తేదీగా భావించి ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు.
దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ జర్నలిస్టులు, మీడియా సంస్థలు ఢిల్లీ సీఈవో కార్యాలయాన్ని సంప్రదించాయి. దీంతో ఢిల్లీ సీఈవో కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్లానర్ ప్రకారం పోలింగ్ ఏర్పాట్లు చేసుకునేందుకు జిల్లా రిటర్నింగ్ అధికారులకు రిఫరెన్స్ కోసమే ఆ తేదీని సర్క్యులర్‌లో పేర్కొన్నట్టు స్పష్టం చేసింది. గత సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే.. కేంద్ర ఎన్నికల సంఘం 2019 మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 11న మొదలైన లోక్‌సభ పోలింగ్, ఏడు దశల్లో సాగింది. ఆ ఏడాది మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

