Air Defence System: ఐరన్ డోమ్ తరహాలో.. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్న డీఆర్డీవో
Air Defence System: ఐరన్ డోమ్ తరహాలోనే ఇండియా కూడా ఓ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను డెవలప్ చేస్తున్నది. ప్రాజెక్టు కుష కింద ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ధి పరుస్తున్నారు. డీఆర్డీవో ఆ పనులు వేగవంతంగా చేస్తోంది. ఐరన్ డోమ్ రేంజ్ 70 కిలోమీటర్లు మాత్రమే. కానీ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రేంజ్ మాత్రం 350 కిలోమీటర్ల దూరం ఉంటుందని భావిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ వద్ద ఉన్న అత్యంత రక్షణాత్మకమైన ఆయుధం ఐరన్ డోమ్. ప్రత్యర్థులు వదిలే లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌ను ఆ ఐరన్ డోమ్ అత్యంత కచ్చితత్వంతో అడ్డుకుంటుంది. ఇటీవల ఇజ్రాయిల్‌పై హమాస్ వేల రాకెట్లతో అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఐరన్ డోమ్ ఇజ్రాయిలీలకు చాలా రక్షణ ఇచ్చింది. వేల సంఖ్యలో రాకెట్లను ఆ డోమ్ వ్యవస్థ అడ్డుకున్నది. అయితే ఆ ఐరన్ డోమ్ తరహాలోనే ఇండియా కూడా ఓ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ(Air Defence System)ను డెవలప్ చేస్తున్నది.
ప్రాజెక్టు కుష కింద ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ధి పరుస్తున్నారు. డీఆర్డీవో ఆ పనులు వేగవంతంగా చేస్తోంది. ఐరన్ డోమ్ రేంజ్ కేవలం 70 కిలోమీటర్లు మాత్రమే. కానీ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రేంజ్ మాత్రం 350 కిలోమీటర్ల దూరం ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే, అప్పుడు భారత అమ్ములపొది మరింత పకడ్బందీగా తయారుకానున్నది. 2028-29 సంవత్సరం వరకు ఆ డిఫెన్స్ వ్యవస్థను తయారు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్టీల్త్ ఫైటర్లు, ఎయిర్‌క్రాఫ్ట్, డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లును సుమారు 350 కిలోమీటర్ల రేంజ్లో ఆ వ్యవస్థ అడ్డుకుంటుందని అంచనా వేస్తున్నారు.
చాలా దూరం నుంచి శుత్ర మిస్సైళ్లను, విమానాలను అడ్డుకునేందుకు ప్రాజెక్టు కుష కింద మూడు అంచెల డిఫెన్స్ సిస్టమ్‌ను డెవలప్ చేస్తున్నారు. సుమారు 2.5 బిలియన్ల డాలర్ల ఖర్చుతో ఆ ప్రాజెక్టు చేపట్టారు. వైమానిక ఉపద్రవాలను అడ్డుకునేందుకు బలమైన వాయు రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు కొందరు అధికారులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
జన గణనపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

