తీవ్ర కరువు, పశుగ్రాస కొరత!
మహారాష్ట్ర ప్రభుత్వం 358 తాలుకాల్లో 265ను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది.కరువు, తీవ్ర వర్షాభావంతో బాధపడుతున్న రైతులకు పంట రుణాల పునర్వ్యవస్థీకరణ, విద్యుత్తు బిల్లుల సబ్సిడీ, ల్యాండ్ రెవెన్యూ మినహాయింపులు వంటిని ప్రభుత్వం కల్పిస్తున్నా అవి వారిని ఏ మాత్రం ఆదుకోలేకపోతున్నాయి
- గతిలేక చెరకు పంటను కోసేస్తున్న లాతూర్ రైతులు
- పాల దిగుబడీ తగ్గిందని ఆవేదన
లాతూర్, అక్టోబర్ 3: ఈ ఏడాది తీవ్ర వర్షాభావం వల్ల మహారాష్ట్రలోని లాతూర్‌లో కరువు, తీవ్ర పశుగ్రాసం కొరత ఏర్పడింది. దీంతో లాతూరు జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా పచ్చికబయళ్లు ఎండిపోతుండగా, పచ్చగడ్డి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో తమ పశువులను రక్షించుకోవడానికి రైతులు పంటలను కోసి పశువులకు పెడుతున్నారు. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం 358 తాలుకాల్లో 265ను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది.
కరువు, తీవ్ర వర్షాభావంతో బాధపడుతున్న రైతులకు పంట రుణాల పునర్వ్యవస్థీకరణ, విద్యుత్తు బిల్లుల సబ్సిడీ, ల్యాండ్ రెవెన్యూ మినహాయింపులు వంటిని ప్రభుత్వం కల్పిస్తున్నా అవి వారిని ఏ మాత్రం ఆదుకోలేకపోతున్నాయి. తనకు ఏడెకరాల పొలం ఉందని, అలాగే ఏడు గేదెలు, రెండు ఆవులు, పలు దూడలు ఉన్నాయని, వాటికి చెరకు పంటనే ఆహారంగా పెడుతున్నట్టు కవ్హాకు చెందిన నారాయణ గుడే ఆవేదన వ్యక్తం చేశాడు. అకారణంగా మిగిలిన పంటల దిగుబడి కూడా తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | హౌస్‌లో నామినేషన్ల మంటలు.. ముకేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన మిథిలేష్, వర్షిణిపై అపూర్వ సంచలన వ్యాఖ్యలు!
Study in USA | ట్రంప్ దెబ్బతో అమెరికా చదువులకు బైబై.. యూరప్‌కు వరుస కట్టిన విదేశీ విద్యార్థులు
Local Body Elections | ఎన్నికల జాప్యంతో కేంద్రం షాక్.. తెలంగాణకు రావాల్సిన రూ.1,700 కోట్లు పెండింగ్
Farmer | మంత్రి వివేక్ ఇలాకాలో రైతు ఆత్మహత్యాయత్నం
Per Capita Income | తలసరి ఆదాయంలో తెలంగాణ దూకుడు.. 8వ స్థానం నుంచి రెండో స్థానానికి!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

