ఉప ఎన్నికల్లో పోటీకి నామినేషన్ దాఖలు చేసిన మమతాబెనర్జి
Mamata Banerjee: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్య అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్లి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్య అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30న పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు. భవానీపూర్‌తో పాటు పశ్చిమబెంగాల్లోని షంషేర్‌గంజ్, జాంగీర్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు.. ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ స్థానానికి కూడా ఈ నెల 30న ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సందర్భంగా తృణమూల్ నుంచి బీజేపీలోకి వెళ్లి బీజేపీ తరఫున బరిలో దిగిన సువేందు అధికారిని ఓడించడమే లక్ష్యంగా ఆమె నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో మమతాబెనర్జి కేవలం 1900 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం మెజారిటీ స్థానాలు సాధించింది. దాంతో ఎమ్మెల్యేగా ఓడిపోయినా మమతాబెనర్జి సీఎం పదవిని స్వీకరించారు. ఆ పదవిలో కొనసాగాలంటే ఆమె ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. అందుకే ఇప్పుడు భవానీపూర్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

