King Cobra: 16 అడుగుల పొడువైన కింగ్ కోబ్రాను పట్టుకున్న రోషిణి.. వీడియో
King Cobra: కేరళకు చెందిన మహిళా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోషిణి ఓ భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్నది. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది. ఆ వీడియోను రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద షేర్ చేశాడు.
తిరువనంతపురం: కేరళకు చెందిన మహిళా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఓ భారీ కింగ్ కోబ్రా(King Cobra)ను పట్టుకున్నది. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది. ఆ వీడియోను రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద షేర్ చేశాడు. పారుతిపల్లి రేంజ్లో బీట్ ఆఫీసర్ జీఎస్ రోహిణి ఆ పామును పట్టుకున్నది. ఆమె అత్యంత ధైర్యసాహసాన్ని ప్రదర్శించి ఆ సర్పాన్ని బంధించింది. కింగ్ కోబ్రా సుమారు 16 అడుగుల పొడుగు ఉన్నట్లు తెలుస్తోంది. స్నేక్ క్యాచింగ్ స్టిక్ దాన్ని ఆమె పట్టేసింది. ఆ తర్వాత దాన్ని సమీప అడవుల్లో వదిలేశారు.
రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద .. బీట్ ఆఫీసర్ సాహసాన్ని మెచ్చుకున్నాడు. రోషిణి ప్రస్తుతం కేరళ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లో పనిచేస్తున్నది. కింగ్ కోబ్రాను ఆమె పట్టుకోవడం ఇదే మొదటిసారి. ఆమె ఇప్పటి వరకు సుమారు 800 పాముల్ని పట్టుకున్నట్లు నంద తన ట్వీట్లో తెలిపారు. రోషిణి సాహసాన్ని నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు. కేరళ అటవీశాఖలో 8 ఏళ్ల నుంచి రోషిణి పనిచేస్తున్నది. కేవలం అయిదు నిమిషాల్లోనే కింగ్ కోబ్రాను పట్టుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ స్నానపు కట్ట వద్ద ఆ స్నేక్‌ను గుర్తించిన స్థానికులు అటవీశాఖకు సమాచారం ఇచ్చారు.
My salutations to the green queens & the bravery shown by them in wild🙏
Beat FO G S Roshni, part of Rapid Response Team of Kerala FD rescuing a 16 feet king cobra.This was the 1st time she was tackling a king cobra though she is credited to have rescued more than 800 snakes… pic.twitter.com/E0a8JGqO4c
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) July 7, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

