‘యెడియూరప్పను సీఎం పదవి నుంచి తొలగిస్తే మరిన్ని సమస్యలు’

బెంగళూరు: కర్ణాటక సీఎం యెడియూరప్పను ఆ పదవి నుంచి తొలగిస్తే రాష్ట్రంలో మరిన్ని సమస్యలు వస్తాయని మఠాధిపతులు హెచ్చరించారు. సీఎం పదవి నుంచి యెడియూరప్ప దిగిపోరన్న ఊహాగానాలు ఊపందుకోవడంతో పలు మఠాలకు చెందిన అధిపతులు ఆదివారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో సమావేశమయ్యారు. సీఎం యెడియూరప్పను మార్చేందుకు బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తుండటంపై వారు చర్చించారు.
యెడియూరప్ప స్థానాన్ని మార్చకూడదని బాలేహోసూర్ మఠానికి చెందిన దింగలేశ్వర స్వామి తెలిపారు. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించినట్లయితే కర్ణాటక మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. యెడియూరప్ప నాయకత్వంలోనే సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలని ఆయన సూచించారు.
కాగా సీఎం యెడియూరప్ప మార్పును వ్యతిరేకిపస్తూ కర్ణాటకలోని పలు మఠాలు, పీఠాలకు చెందిన అధిపతులు గత కొన్ని రోజులుగా సమావేశమవుతున్నారు. యెడియూరప్పను కలిసి ఆయనకు తమ మద్దతును తెలియజేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బదిలీ
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

