పార్టీ అధ్యక్షుడి అవినీతిని చర్చిస్తూ కెమెరాకు చిక్కిన కాంగ్రెస్ నేతలు!
కర్ణాటక కాంగ్రెస్ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, కనకపురా ఎమ్మెల్యే డీకే శివకుమార్ అవినీతి గురించి చర్చించుకుంటూ కెమెరాకు చిక్కారు.

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, కనకపురా ఎమ్మెల్యే డీకే శివకుమార్ అవినీతి గురించి చర్చించుకుంటూ కెమెరాకు చిక్కారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది. దీనిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కో-ఆర్డినేటర్ సలీమ్ అహ్మద్ మాట్లాడుకుంటూ కనిపించారు. శివకుమార్, అతని అనుచరుడు ముల్గుంద్ తీసుకుంటున్న లంచాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు.
గతంలో 6-8 శాతం మాత్రమే తీసుకునే వాళ్లమని, కానీ కొత్తగా ‘డీకే అడ్జస్ట్మెంట్’తో అది 12 శాతానికి పెరిగిందని సలీమ్ అహ్మద్ అనడం వినిపిస్తోంది. అలాగే శివకుమార్ సహచరుడైన ముల్గుంద్ 50-100 కోట్ల రూపాయలు సంపాదిస్తే శివకుమార్ ఎంత సంపాదించి ఉంటాడని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే శివకుమార్ మాట్లాడే సమయంలో తాగిన వాడిలో తడబడతాడని జోకులేసుకున్నారు.
ఆపై డీకేను పార్టీ అధ్యక్షుడిని చేయడం కోసం కార్యకర్తలు చాలా కష్టపడ్డారని, కానీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మాత్రం పార్టీని, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఉగ్రప్ప విమర్శించారు. ఈ వీడియో వైరల్ అవడంతో వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన కాంగ్రెస్.. సలీమ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఉగ్రప్పకు షోకాజ్ నోటీసులు పంపింది.
ఈ వీడియోను బీజేపీ నేతలు కూడా షేర్ చేశారు. బీజేపీ జాతీయ సమాచార, సాంకేతిక విభాగం ఇన్చార్జి అమిత్ మాలవీయ ఈ వీడియోను షేర్ చేస్తూ ‘ఇంట్రస్టింగ్’ అంటూ కామెంట్ చేశారు.
Former Congress MP V S Ugrappa and KPCC media coordinator Salim discuss how Party president DK Shivakumar takes bribes and a close aid of his has made between 50-100 crores in collection. They are also discussing how he stutters while talking and as if he his drunk.
— Amit Malviya (@amitmalviya) October 13, 2021
Interesting. pic.twitter.com/13rDXIRJOE
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

