Kangana Ranaut | బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు ఆగ్రా కోర్టు నోటీసులు..!
Kangana Ranaut | ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చిక్కుల్లోపడ్డారు. రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేసులో కంగనాకు ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగ్రాలోని రాజీవ్ గాంధీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామశంకర్ శర్మ, సీనియర్ న్యాయవాది ఈ ఏడాది సెప్టెంబర్ 11న కంగనాపై కేసు వేశారు.
Kangana Ranaut | ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చిక్కుల్లోపడ్డారు. రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేసులో కంగనాకు ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగ్రాలోని రాజీవ్ గాంధీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామశంకర్ శర్మ, సీనియర్ న్యాయవాది ఈ ఏడాది సెప్టెంబర్ 11న కంగనాపై కేసు వేశారు. ఆగస్టు 27న పత్రికల్లో కంగనా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆయన కేసు నమోదు చేశారు. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉండేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని.. సాగు చట్టాలను వెనక్కితీసుకున్నా నిరసనలు కొనసాగేలా విదేశీ శక్తులు, స్వార్థ ప్రయోజనాలను ఆశించే వారు నిరసనలను ప్రోత్సహించారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది, విదేశీ శక్తులు ఇందుకు కుట్ర పన్నారంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలో దుమారం రేపాయి. అదే సమయంలో ఆమె వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, కంగనా రనౌత్ దేశంలోని కోట్లాది మంది రైతులను అవమానించారని రామశంకర్ శర్మ ఆరోపించారు.
ఆమె రైతులను హంతకులు, రేపిస్ట్లు, తీవ్రవాదులతో పోల్చిందన్నారు. తాను ఓ రైతు కుమారుడినేనని.. తాను చూడా వ్యవసాయం చేశానన్నారు. కంగనా చేసిన వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఈ సందర్భంగా గతంలో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సైతం గుర్తు చేశారు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది రామశంకర్ శర్మతో పాటు గ్రేటర్ ఆగ్రా బార్ ప్రెసిడెంట్ సీనియర్ న్యాయవాది దుర్గ్ విజయ్ సింగ్ భయ్యా, రామ్‌దత్ దివాకర్, ఆర్ఎస్ మౌర్య, రాకేష్ నౌహ్వార్, బిఎస్ ఫౌజ్దార్, రాజేంద్ర గుప్తా, ధీరజ్, ఉమేష్ జోషి, డాక్టర్ రాజ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ మేరకు వాదనలు విన్న న్యాయస్థానం వ్యక్తిగతంగా హాజరై ఈ నెల 28న తన పక్షాన్ని హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

