యూపీలో జంగిల్ రాజ్ నడుస్తున్నది: మాయావతి
Mayavati on UP government: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 'జంగిల్ రాజ్' నడుస్తున్నదని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు.

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ‘జంగిల్ రాజ్’ నడుస్తున్నదని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. బ్లాక్ పంచాయతీ ఎన్నికల సమయంలో చెలరేగిన హింసను దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధానంపై మండిపడుతూ ట్వీట్ చేశారు. ”బీజేపీ పాలనలో చట్టాలేమీ లేవు. కేవలం జంగిల్ రాజ్ నడుస్తున్నది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీవ్ర స్థాయిలో హింస చెలరేగింది. లఖింపూర్‌లో ఓ మహిళ చీర లాగి, అసభ్యంగా ప్రవర్తించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం” అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. దాంతో పోటీలో ఉన్న వివిధ పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అందరిలాగే పాస్‌గవాన్ బ్లాక్ నుంచి ఎస్పీ నాయకురాలు రీతూ సింగ్ అనే మహిళ కూడా నామినేషన్ వేయడానికి బయల్దేరారు. ఈ సమయంలో కొందరు దుండగులు ఆమెను అడ్డగించి చీర లాగారు. నామినేషన్ పత్రాలను కూడా చించి పారేశారు. దీంతో రీతూ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

