Rajnath Singh | ‘భారత్‌లో చేరండి, మా సొంతంగా భావిస్తున్నాం’.. పీవోకే ప్రజలకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు
Rajnath Singh | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు భారత్‌లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. విదేశీయులుగా పరిగణిస్తున్న పాకిస్థాన్‌లా కాకుండా మిమ్మల్ని మా స్వంతంగా భావిస్తున్నామని అన్నారు.
శ్రీనగర్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు భారత్‌లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పిలుపునిచ్చారు. విదేశీయులుగా పరిగణిస్తున్న పాకిస్థాన్‌లా కాకుండా మిమ్మల్ని మా స్వంతంగా భావిస్తున్నామని అన్నారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రాకేష్ సింగ్ ఠాకూర్‌కు మద్దతుగా రాంబన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. పాకిస్థాన్ అదనపు సొలిసిటర్ జనరల్ ఆ దేశ కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారని, పీవోకే విదేశీ భూమిగా అందులో పేర్కొన్నట్లు తెలిపారు. ‘పాకిస్థాన్ మిమ్మల్ని విదేశీయులుగా పరిగణిస్తోంది. అయితే భారత్ ప్రజలు మిమ్మల్ని అలా పరిగణించరని పీవోకే నివాసితులకు చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని మా స్వంతంగా పరిగణిస్తాం. వచ్చి మాతో చేరండి’ అని అన్నారు.
కాగా, 2019 ఆగస్ట్ 5న ఆర్టికల్ 370ను రద్దు చేసినప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌లోని మొత్తం భద్రతా పరిస్థితిలో భారీ మార్పు వచ్చిందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇప్పుడు యువకులు పిస్టల్స్, రివాల్వర్లకు బదులుగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను చేత పట్టుకుంటున్నారని అన్నారు. ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తామన్న నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఎన్నికల వాగ్దానంపై ఆయన మండిపడ్డారు. బీజేపీ ఉన్నంత వరకు అది అసాధ్యమని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి మద్దతివ్వాలని అక్కడి ప్రజలను కోరారు.
पाकिस्तान की सरकार पीओके को foreign land मानती है लेकिन भारत पीओके को अपना मानता है… pic.twitter.com/dYg4fxYsaT
— Rajnath Singh (@rajnathsingh) September 8, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

