Jio Platforms | జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్.. కీలకమైన అంశాలు ఇవే..!
Jio Platforms | జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో (Jio Platforms IPO) లో షేర్లు పొందిన ఇన్వెస్టర్ల (Investers) కు గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ఆధారంగా లిస్టింగ్ రోజైన బుధవారం (అక్టోబర్ 28) సుమారు 22 శాతం లాభం వచ్చే అవకాశం ఉన్నది.
Jio Platforms : జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో (Jio Platforms IPO) లో షేర్లు పొందిన ఇన్వెస్టర్ల (Investers) కు గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ఆధారంగా లిస్టింగ్ రోజైన బుధవారం (అక్టోబర్ 28) సుమారు 22 శాతం లాభం వచ్చే అవకాశం ఉన్నది. జియో ప్లాట్‌ఫామ్స్ జారీచేసిన ఈ నూతన షేర్లు అక్టోబర్ 28న, అంటే బుధవారం బీఎస్ఈ (BSE), ఎన్ఎస్ఈ (NSE) లలో నమోదు (Listing) కానున్నాయి.
లిస్టింగ్‌కు సంబంధించిన కీలక అంశాలు
జియో ప్లాట్‌ఫామ్స్ ఒక్కో షేరుకు రూ.1,119 చొప్పున 27 కోట్ల కొత్త షేర్లను జారీచేసింది. ఈ షేర్ల ద్వారా రూ.10.3 లక్షల కోట్ల విలువతో భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన ఐపీఓలలో ఒకదాన్ని పూర్తి చేసింది.
ఈ ఐపీఓ విలువ ప్రకారం.. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా జియో ప్లాట్‌ఫామ్స్ 4వ అతిపెద్ద భారతీయ కంపెనీగా నిలిచింది. దీనికంటే ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ.16.2 లక్షల కోట్లు), భారతీ ఎయిర్టెల్ (రూ.12.2 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ.10.6 లక్షల కోట్లు) ఉన్నాయి.
భారత స్టాక్ మార్కెట్ల చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే భారత మూలధన మార్కెట్ల చరిత్రలో ఏ కంపెనీ కూడా రూ.10 లక్షల కోట్లకుపైగా విలువతో ఐపీఓను ప్రారంభించలేదు.
జేపీఎల్ (జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్) షేర్లు అలాట్మెంట్ ప్రైస్ కంటే బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని బలమైన ఐపీఓ డిమాండ్, గ్రే మార్కెట్ ప్రీమియం సూచిస్తున్నాయి.
ఒకవేళ జేపీఎల్ షేర్లు కేటాయింపు ధర కంటే 20% ప్రీమియంతో అంటే రూ.1,340 వద్ద లిస్ట్ అయితే జేపీఎల్ భారతదేశంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా ఆరంభమవుతుంది.
ఒక్కో షేరుకు రూ.1,340 చొప్పున జేపీఎల్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12.3 లక్షల కోట్లను మించిపోతుంది. ఒకవేళ జియో, దాని మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతదేశంలో రెండో స్థానంలో ఆరంభమైతే అది కూడా మరో చారిత్రాత్మక మైలురాయి అవుతుంది.
అదేవిధంగా కేవలం ఐపీఓ వాల్యుయేషన్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫామ్స్ కలిసి రూ.27 లక్షల కోట్లకుపైగా సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌ను భారతదేశంలో అత్యంత విలువైన గ్రూప్‌గా నిలుపుతాయి.
2026 అక్టోబర్ 27 నాటికి పబ్లిక్‌గా లిస్ట్ అయిన మొత్తం 32 టాటా గ్రూప్ కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా రూ.25.7 లక్షల కోట్లుగా ఉన్నది.
పబ్లిక్‌గా లిస్ట్ అయిన మొత్తం 11 అదానీ గ్రూప్ కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా రూ.16.6 లక్షల కోట్లుగా ఉన్నది.
IPO ధర కంటే అధిక ధరతో JPL సంస్థ మార్కెట్లోకి ప్రవేశించడం రిలయన్స్ గ్రూప్‌ను రూ.30 లక్షల కోట్ల మార్కెట్ విలువగల మైలురాయికి మరింత దగ్గరగా తీసుకెళ్తుంది. ఇది ఏ భారతీయ కార్పొరేట్ గ్రూప్కైనా ఇప్పటివరకు నమోదైన అత్యధిక విలువ అవుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BSE
- GMP
- IPO listing
- jio platforms
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio Platforms | జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్.. కీలకమైన అంశాలు ఇవే..!
ఈ-వ్యర్థాలపై విద్యార్థులకు అవగాహన
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పట్టభద్రుల ఓటరు నమోదు
Harish Rao | రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికే అపాయింట్మెంట్ లేదు.. ఇదెక్కడి ప్రజాపాలన..? : హరీశ్ రావు
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. స్పందించిన ఏఆర్ రెహమాన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

