Hemant Soren | జార్ఖండ్ రాజకీయాల్లో కీలక మార్పులు..! మళ్లీ సీఎంగా హేమంత్ సోరెన్..!
Hemant Soren | జార్ఖండ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుబోతున్నాయి. హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈడీ కేసులో ఆయన బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంపై సోరెన్ సీఎం పదవికి బుధవారం రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
Hemant Soren | జార్ఖండ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుబోతున్నాయి. హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈడీ కేసులో ఆయన బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంపై సోరెన్ సీఎం పదవికి బుధవారం రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో ఇవాళ జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వర్గాలు మాట్లాడుతూ చంపై సోరెన్ స్థానంలో హేమంత్ సోరెన్ మళ్లీ సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాయి. సీఎం చంపై సోరెన్ నివాసంలో జరిగిన సమావేశంలో జేఎంఎం శాసనసభా పక్ష నేతగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకోవాలని కూటమి నేతలు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు పేర్కొన్నాయి.
జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ రాష్ట్రంలోని పార్టీ నేతృత్వంలోని కూటమికి చెందిన ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతుల చేపట్టే అవకాశం కనిపిస్తున్నది. అధికార మార్పిడి ఊహాగానాల మధ్య రాంచీలో ఇండియా కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరుగనున్నది. ఈ సమావేశాన్ని హేమంత్ సోరెన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇటీవల భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేసింది. దాదాపు ఐదు నెలల తర్వాత అంటే జూన్ 28న జైలు నుంచి విడుదలయ్యాడు. భేటీ నేపథ్యంలో సీఎం చంపై సోరెన్ ముఖ కార్యక్రమాలన్నింటిని రద్దు చేశారు. వాస్తవానికి బుధవారం రాష్ట్రంలో ఎంపిక చేసిన 1500 ఉపాధ్యాయులకు సీఎం చంపై సోరెన్ నియామకపత్రాలు పంపిణీ చేయాల్సి ఉంది. మంగళవారం సైతం సీఎం కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి.
హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత ఫిబ్రవరి 2న జార్ఖండ్ 15వ ముఖ్యమంత్రిగా చంపై సోరెణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక నేడు జరుగబోయే సమావేశానికి హాజరుకావాలని పార్టీ సూచించిందని కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. ఈ ఏడాది చివరలో జరుగనున్న ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశానికి జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్ సైతం హాజరవుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ అభివృద్ధే ఈ సమావేశం ఎజెండా అని జేఎంఎం అధికార ప్రతినిధి మనోజ్ పాండే తెలిపారు. భేటీలో ముఖ్యమంత్రితో పాటు హేమంత్ సోరెన్ సోదరుడు, మంత్రి బసంత్ సోరెన్ పాల్గొననున్నారు. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా చేయడంతో గాండే సీటు ఖాళీ అయ్యింది. అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

