జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాను రెడ్ జోన్‌గా ప్రకటన

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాను రెడ్ జోన్‌గా సోమవారం ప్రకటించారు. మిగతా 19 జిల్లాలను ఆరంజ్ జోన్‌గా వెల్లడించారు. ఆదివారం శ్రీనగర్‌లో కొత్తగా 1,126 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పరిపాలనా యంత్రాంగం కఠిన నిబంధనలు విధించింది. శ్రీనగర్‌తోపాటు లఖాన్పుర్, జవహర్ టన్నల్ కంటైన్మెంట్ జోన్లలో 500 మీటర్ల పరిధి వరకు రెడ్ జోన్‌గా ప్రకటించింది. దీంతో నగరంలో పలు చోట్ల శానిటైజేషన్ డ్రైవ్ చేపట్టారు.
మరోవైపు శ్రీనగర్‌తోపాటు మరో మూడు జిల్లాల్లో కర్ఫ్యూను గురువారం వరకు పొడిగించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో దీనిని మరికొన్ని రోజులు పొడిగించే అవకాశమున్నదని చెప్పారు. కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న, కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే ప్రాంతాలను కరోనా రెడ్ జోన్‌గా ప్రకటిస్తారని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

