Supreme Court | జల్లికట్టును నెత్తుటి క్రీడ అనలేం : సుప్రీం కోర్టు
Supreme Court | తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జల్లికట్టులో హింస ఉంటుందని, అంత మాత్రాన దాన్ని నెత్తుటి క్రీడ అనలేమని పేర్కొంది. ఈ క్రీడలో రక్తం చిందడం యాదృచ్ఛికం మాత్రమేనన్న ధర్మాసనం.. నెత్తురు కళ్ల చూడాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో ఎవరూ పాల్గొనరని తెలిపింది.

జల్లికట్టుకు అనుమతిస్తూ 2017లో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ చట్టానికి తమిళనాడు సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై.. జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలో జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.
పిటిషన్ల విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్.. జల్లికట్టును నెత్తుటి క్రీడగా అభివర్ణించారు. అయితే ఈ వ్యాఖ్యలను ధర్మాసనం తప్పుబట్టింది. ‘జల్లికట్టులో పాల్గొనే వారు ఎవరూ ఆయుధం వాడరు కదా. అందులో హింస ఉండొచ్చు కానీ, దాన్ని నెత్తుటి క్రీడ అనలేం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు