నిత్యం హద్దు మీరుతున్న చైనా.. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు
మన పొరుగుదేశం చైనాతో సంబంధాలు ‘ఆల్ ఈజ్ వెల్'గా ఉందని ఒక పక్క కేంద్రం దేశ ప్రజలను మభ్యపెడుతున్నది. మరో పక్క మన దేశ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో మన సైనికులతో చైనా బలగాలు నిత్యం ఘర్షణ పడుతున్నాయని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డీజీ శత్రుజీత్ కపూర్ సంచలన విషయాలు వెల్లడించారు.
- ఐటీబీపీ డీజీ శత్రుజీత్ కపూర్ వెల్లడి
- కేంద్రంపై ప్రతిపక్షాల విమర్శలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 23 : మన పొరుగుదేశం చైనాతో సంబంధాలు ‘ఆల్ ఈజ్ వెల్’గా ఉందని ఒక పక్క కేంద్రం దేశ ప్రజలను మభ్యపెడుతున్నది. మరో పక్క మన దేశ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో మన సైనికులతో చైనా బలగాలు నిత్యం ఘర్షణ పడుతున్నాయని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డీజీ శత్రుజీత్ కపూర్ సంచలన విషయాలు వెల్లడించారు. రాజస్థాన్ అళ్వార్‌లో ఐటీబీపీ సిబ్బంది జరుపుకున్న ఒక వార్షిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అరుణాచల్ సరిహద్దు ప్రాంతంలో నిత్యం ప్రతిష్టంభన నెలకొని ఉంటున్నదని, ఇటీవలి కొన్ని నెలలుగా ఈశాన్య ప్రాంత సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది జూలై నుంచి ఇరువర్గాల సైనికుల మధ్య ఘర్షణలు, దాడులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
టాక్సింగ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి కీలకమైన పెట్రోలింగ్ ప్రాంతాల వద్ద భారత సైనికుల ప్రవేశాన్ని చైనా దళాలు నిరాకరిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా అరుణాచల్ ప్రదేశ్‌లో సరిహద్దు వెంబడి పలు ప్రాంతాల్లో అనేక ఘర్షణలు జరిగాయన్నారు. చైనా సైనికులను ఎదుర్కోవడంలో మన దళాల శౌర్య కమాండోలు అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరైనప్పుడు కూడా రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయని కపూర్ ప్రకటన సూచిస్తున్నది. 1962లో ఏర్పడిన ఐటీబీపీకి చెందిన బలగాలు చైనాతో ఉన్న 3,488 కి.మీ వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించి దేశానికి రక్షణ కల్పిస్తున్నారు.
మోదీ మౌనమేల : కాంగ్రెస్
సరిహద్దు సంఘర్షణ విషయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా లేవనెత్తింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలు స్పందించాలని డిమాండ్ చేసింది. చైనా సరిహద్దుల వద్ద ఇంత ఉద్రిక్తత నెలకొని ఉన్నా మోదీ ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ప్రశ్నించారు. సరిహద్దు వద్ద పెట్రోలింగ్ పాయింట్లను మరోసారి కోల్పోయామంటూ స్థానికులు అంటున్నారని, అరుణాచల్‌లోని మన పట్టణాల పేర్లను చైనా మార్చేస్తున్నదని, 60,000 మెగావాట్ల సామర్థ్యంతో భారీ డ్యామ్‌ను నిర్మిస్తూ మన పర్యావరణ, నీటి భద్రతకు ముప్పు కలిగిస్తున్నా కేంద్రం నోరు మెదపెడం లేదని విమర్శించారు. కేంద్రం తన నిర్లిప్తత వైఖరి ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. దేశ సరిహద్దులను కాపాడటానికి బదులుగా, దేశంలోని అంతర్గత నిరసననలను అణచివేయడానికే మన బలగాలను ప్రయోగిస్తున్నదని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

