శాస్త్రవేత్తల కృషి ఫలించింది.. పీఎస్ఎల్వీ-సీ52 ప్రయోగం విజయవంతం
ISRO | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకున్నది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ప్రయోగం విజయవంతమయింది.
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకున్నది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ప్రయోగం విజయవంతమయింది. లక్ష్యం దిశగా దూసుకెళ్లిన సీ52 రాకెట్ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ సోమనాథన్ అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ప్రయోగం విజయవంతం అయిందని చెప్పారు. మూడు ఉపగ్రహాలను విజయంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టామని వెల్లడించారు.
పీఎస్ఎల్వీ–సీ52 రాకెట్ 1710 కిలోల ఆర్బిట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈఓఎస్–04, 17.50 కిలోల ఐఎన్ఎస్-2డీటీ, 8.10 కిలోల బరువున్న ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈఓఎస్ అనేది రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. దీన్ని వ్యవసాయం, అటవీ సంరక్షణ, నేల తేమ, హైడ్రాలజీ, వరదల మ్యాపింగ్‌కు సంబంధించి అన్ని వాతావరణ పరిస్థితుల్లో హైక్వాలిటీ ఫొటోలను అందించేలా రూపొందించారు. ఐఎన్ఎస్-2డీ ఉపగ్రహాన్ని భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nigerian tourist | ఎన్టీఆర్ బీచ్‌లో నైజీరియా పర్యాటకుడు మృతి..మరో ఐదుగురు సురక్షితం
Nitin Gadkari | అవన్నీ తప్పుడు కథనాలు, నేను పనిచేస్తూనే ఉంటా.. రిటైర్మెంట్ వార్తలపై నితిన్ గడ్కరీ..!
Suriya | హోంబలే ఫిలిమ్స్ నయా ప్రాజెక్ట్.. సూర్య రోల్ ఏంటో తెలిసిపోయింది.. !
Puvwada Ajay Kumar | వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవాలి: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Gongidi Sunitha | గ్లోబల్ సమ్మిట్‌తో ఒరిగిందేమిటో సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు

