Tejas Express: రైలు రెండున్నర గంటలు ఆలస్యం.. 4.5 లక్షల పరిహారం ఇవ్వనున్న ఐఆర్సీటీసీ
మీరు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్న సెటైర్ మన ఇండియన్ రైల్వేస్‌పై ఎప్పటి నుంచో ఉన్నదే. మన రైళ్లు ఆలస్యానికి కేరాఫ్. ఎప్పుడు ఏ రైలు ఎక్కడ ఆగుతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియన పరిస్థితి. అయితే ఇలా రైలు ఆలస్యమైన ప్రతిసారీ పరిహారం అందించడం ఎప్పుడైనా విన్నారా?

న్యూఢిల్లీ: మీరు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్న సెటైర్ మన ఇండియన్ రైల్వేస్‌పై ఎప్పటి నుంచో ఉన్నదే. మన రైళ్లు ఆలస్యానికి కేరాఫ్. ఎప్పుడు ఏ రైలు ఎక్కడ ఆగుతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియన పరిస్థితి. అయితే ఇలా రైలు ఆలస్యమైన ప్రతిసారీ పరిహారం అందించడం ఎప్పుడైనా విన్నారా? కానీ ఇండియాలో తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్( Tejas Express ) రెండున్నర గంటలు ఆలస్యమైనందుకు అందులోని మొత్తం 2035 మంది ప్రయాణికులకు ఐఆర్సీటీసీ రూ.4.5 లక్షల పరిహారం చెల్లించనుంది. శని, ఆదివారాల్లో మూడు ట్రిప్పులు కలిపి ఈ రైలు రెండున్నర గంటలు ఆలస్యమైంది. శనివారం భారీ వర్షాల కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో సిగ్నల్ ఫెయిలవడంతో ఈ తేజస్ ఎక్స్‌ప్రెస్ ఆలస్యమైంది. ఆదివారం కూడా లక్నో నుంచి ఢిల్లీ వెళ్లే ఈ రైలు గంట ఆలస్యంగా నడిచింది.
పరిహారం ఎందుకు?
ఇండియాలో తొలిసారిగా ఓ రైలు ఆలస్యమైతే పరిహారం చెల్లించే నిబంధన తేజస్ ఎక్స్‌ప్రెస్ విషయంలో ఉంది. రైలు గంట ఆలస్యమైతే రూ.100, రెండు గంటలు, అంతకంటే ఎక్కువైతే రూ.250 పరిహారం ఒక్కో ప్రయాణికుడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు శనివారం తేజస్ ఎక్స్‌ప్రెస్ ఆలస్యమైనందుకు అందులోని 1574 మంది ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున మొత్తం రూ.3.93 లక్షలు, ఆదివారం ఆలస్యమైనందుకు అందులోని 561 మంది ప్రయాణికులు ఒక్కొక్కరికి రూ.150 చొప్పున ఈ రైలును ఆపరేట్ చేస్తున్న ఐఆర్సీటీసీ చెల్లిస్తుంది.
విమానంలాంటి వసతులతో తొలి తేజస్ ఎక్స్‌ప్రెస్ 2019, ఆగస్ట్ 4న లక్నో నుంచి ఢిల్లీ వెళ్లింది. ఈ రెండేళ్ల కాలంలో గంటలోపు రైలు ఆలస్యమైన సందర్భాలు ఐదుసార్లు మాత్రమే ఉన్నాయి. 99.9 శాతం ఈ రైలు ఆలస్యం కాదని ఐఆర్సీటీసీ చెబుతోంది. గత రెండేళ్లలో ఐఆర్సీటీసీ ఇంత భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి రావడం ఇదే తొలిసారి. గత శీతాకాలంలోనూ ఇలాగే రైలు రెండు గంటల ఆలస్యం కాగా.. అందులోని 1500 మంది ప్రయాణికులకు పరిహారం చెల్లించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

