Viral Video | నోటికాడి బుక్కను అడ్డుకున్న ఐపీఎస్ ఆఫీసర్..
Viral Video | ఓ ఐపీఎస్ ఆఫీసర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఓ సీనియర్ పోలీసు కానిస్టేబుల్ భోజనం చేస్తుండగా అడ్డుకున్నాడు. ఇక్కడికి తినడానికి రాలేదు.. విధి నిర్వహణకు వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆ కానిస్టేబుల్‌ను ఐపీఎస్ ఆఫీసర్ హెచ్చరించాడు.
Viral Video | లక్నో : ఓ ఐపీఎస్ ఆఫీసర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఓ సీనియర్ పోలీసు కానిస్టేబుల్ భోజనం చేస్తుండగా అడ్డుకున్నాడు. ఇక్కడికి తినడానికి రాలేదు.. విధి నిర్వహణకు వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆ కానిస్టేబుల్‌ను ఐపీఎస్ ఆఫీసర్ హెచ్చరించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అజంఘర్‌లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అజంఘర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో అజంఘర్ పోలీసులు బందోబస్తు కల్పించారు. అయితే కార్యక్రమం వద్ద భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఇక విధుల్లో ఉన్న ఓ సీనియర్ పోలీసు కానిస్టేబుల్ ప్లేటులో ఆహారం వడ్డించుకుని తినేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే అక్కడికి వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్.. అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇక్కడికి విధులకు వచ్చామని, భోజనం చేయడానికి కాదని మందలించారు.
దీంతో తీవ్ర అవమానానికి గురైన ఆ కానిస్టేబుల్.. ఆహారంతో ఉన్న ప్లేటును డస్ట్ బిన్లో పడేసి వెళ్లిపోయారు. సీఎం ఇక్కడ్నుంచి వెళ్లిపోయిన తర్వాత భోజనం చేయాలని ఆదేశించారు. ఐపీఎస్ ఆఫీసర్‌ను శుభం అగర్వాల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
#आजमगढ़: कार्यक्रम में खाना खाने लगा सिपाही तो आईपीएस शुभम अग्रवाल ने खाना छोड़कर सिपाही को ड्यूटी पर जाने को कहा,
साहब की डांट के बाद सिपाही को प्लेट रखना पड़ा वीडियो हुआ वायरल। pic.twitter.com/aGfjKaiGVy— Faiz khan (@JournalistFaiz1) February 13, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

