Watch: హీరో మాదిరిగా స్టంట్ చేసేందుకు విద్యార్థి యత్నం.. స్కూల్ బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి కిందకు జంప్
Student Jumps Off School Building | మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలుడు హీరో మాదిరిగా స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు. స్కూల్ బిల్డింగ్ మొదటి అంతస్తు పైనుంచి కిందకు జంప్ చేశాడు. (Student Jumps Off School Building) ఈ నేపథ్యంలో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
లక్నో: మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలుడు హీరో మాదిరిగా స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు. స్కూల్ బిల్డింగ్ మొదటి అంతస్తు పైనుంచి కిందకు జంప్ చేశాడు. (Student Jumps Off School Building) ఈ నేపథ్యంలో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. డాక్టర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషన్ స్కూల్లో చదువుతున్న మూడో తరగతి విద్యార్థికి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే ఇష్టం. క్రిష్ మూవీలో ఆ హిరో చేసినట్లుగా స్టంట్ చేయాలని అతడు భావించాడు. మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి రెండు కాళ్లపై నిలబడతానని తోటి విద్యార్థులతో చెప్పాడు.
కాగా, బుధవారం ఆ విద్యార్థి వాటర్ కోసమంటూ క్లాస్ నుంచి బయటకు వచ్చాడు. తోటి విద్యార్థులతో కలిసి స్కూల్ బిల్డింగ్ మొదటి అంతస్తుకు చేరుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి కిందకు దూకాడు. అయితే రెండు కాళ్లపై నిల్చోలేక నేలపై పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ బాలుడి ముక్కు, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఆ బాలుడు స్కూల్ మొదటి అంతస్తు నుంచి దూకి గాయపడటం చూసిన మిగతా విద్యార్థులు భయంతో తమ క్లాస్ రూమ్‌కు వెళ్లిపోయారు. అయితే ఆ విద్యార్థిని స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఈ స్టంట్ చేయమని తోటి విద్యార్థులెవరూ బలవంతం చేయలేదని స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. కాగా, ఆ స్కూల్ బిల్డింగ్ ఆవరణలో ఉన్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
कानपुर
कक्षा 3 के छात्र ने स्कूल बिल्डिंग से लगाई छलांग
स्कूल की पहली मंजिल से लगाई छलांग, गंभीर घायल
सुपर हीरो पर बनी फिल्म कृष से प्रेरित होकर लगाई छलांग
छात्र के मुंह, पैर में आई गंभीर चोट, अस्पताल में भर्ती
सीसीटीवी में कैद हुई पूरी घटना@kanpurnagarpol pic.twitter.com/I1MIvdXR3N
— Adv Karuna sharma (@advksharmaa) July 21, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

